E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లకు కరిగిపోయిన మహా.. చక్రీని మహా వదిలేస్తుందా..?

Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లకు కరిగిపోయిన మహా.. చక్రీని మహా వదిలేస్తుందా..?
Advertisement

Podarillu Today Episode May 23rd : మహాలక్ష్మి ఇంట్లో బూజూ దులుపుతూ ఉంటుంది. బయట కారు వచ్చి ఆగడంతో నారాయణ ఎవర్ అని చూస్తూ ఉంటాడు.. అయితే కారులోంచి ప్రతాప్ రాగానే అతను చేతిలో ఉన్న సంచిలోని మందును తీసి తాగుబోతాడు.. మహాలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చాడు నాన్న ఇది పద్ధతి కాదు అని అంటాడు మాధవ్.. ఏ ముహూర్తనా చుట్టరికమని అన్నాము నిజంగానే చుట్టం అయ్యారు కదా అని ప్రతాప్ నారాయణ తో మాట్లాడుతాడు.. నారాయణ మహాలక్ష్మి బూజు దులుపుతుంది అని చూపించమని ప్రతాప్ నా కూతురు ఇంత కష్టపడి పోతుంది అని అనుకుంటాడు.. ఎప్పుడు ఏ పని చేయదండి ఇప్పుడేదో సరదాగా చేస్తుంది అని నారాయణ అంటాడు. అయితే మాధవ్ మహాలక్ష్మికి వాళ్ళ నాన్న వచ్చిన విషయాన్ని చెప్తాడు. మొదట ఎందుకు వచ్చావు నాన్న అని అడిగిన మహాలక్ష్మి ఆ తర్వాత అతను మాటలు విని కరిగిపోతుంది.. తండ్రి కూతురు సెంటిమెంట్ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.

కూతురు చచ్చిపోయిందిగా నాన్న..

తన తండ్రి తనకోసం వచ్చాడు అని చాలా సంతోషంగా ఫీల్ అయిన మహాలక్ష్మి. గతంలో తాను చేసిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఎందుకు వచ్చావు నాన్న అని కఠినంగా మాట్లాడుతుంది. కూతురు చచ్చిపోయింది అని అన్నావు కదా నాన్న ఇప్పుడు ఎలా వచ్చావు అని అనగానే ఇన్ని రోజులు గుండెని రాయి చేసుకుని మీ అమ్మ నేను ఉన్న అమ్మ ఇంకా నిన్ను వదిలేసి ఉండలేకపోతున్నాము అని ప్రతాప్ అంటాడు. నీకోసం నేను మీ అమ్మ జీవచ్ఛవంలా బతుకుతున్నాము. మా పరువు ని తీసేసావ్ అన్న కోపంతో నీకు దూరమయ్యావు తప్ప నిన్ను దూరం పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు అని ప్రతాప్ అనగానే మహాలక్ష్మి కన్నీళ్ళతో తన తండ్రిని వెళ్లి కౌగిలించుకుంటుంది.. నాన్న అని తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు..

ఇంటిని చూసి షాకైన ప్రతాప్..

Advertisement

అమ్మ మహాలక్ష్మి బయట ఎండగా ఉంది మీ నాన్నని తీసుకొని లోపలికి రమ్మని మాధవ్ అనగానే లోపలికి వెళ్తారు. ఆ ఇంటికి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్.. ఏంటి ఈ ఇల్లు ఇంత చండాలంగా ఉంది ఇలాంటి ఇంటిలో నా కూతురు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందే అని లో లోపల బాధ పడిపోతూ ఉంటాడు. నా కూతుర్ని ఇంటిలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోవాలి అని ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఇంట్లోని వాళ్లందరినీ పరిచయం చేస్తుంది.. నాకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది నాన్న అని మహాలక్ష్మి తన తండ్రి చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నేను వచ్చాను కదా నువ్వేం బాధపడకమ్మా అని మహాలక్ష్మి ఓదారుస్తాడు ప్రతాప్.

మాధవ్ మర్యాదలకు ఫిదా..

మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్లి టీ పెట్టుకుని వస్తాను అని మాధవ్ అంటాడు.. నువ్వెందుకు పెద్ది, నేను పెట్టుకొని వస్తాను నువ్వు కూర్చొని మహాలక్ష్మి అంటుంది. కానీ నువ్వు టీ పెట్టడం కూడా నేర్చుకున్నావా అని ప్రతాప్ అడుగుతాడు. అవును నాన్న పెద్ది నాకు దగ్గర నుండి నేర్పించాడు నేను చాలా బాగా టీ పెట్టడం నేర్చుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది. నువ్వు కూర్చుని మీ నాన్నతో మాట్లాడుతున్న అమ్మ నేను టీ తీసుకుని వస్తాను అని మాధవ అనగానే ప్రతాప్ చక్కర లేకుండా తీసుకురండి అని అంటాడు. మాధవ్ చేసిన మర్యాదలకు ప్రతాప్ ఇబ్బంది పడుతూ ఉంటాడు.. కానీ ఎలాగైనా సరే ఇన్ని మెట్లు దిగొచ్చాను కాబట్టి నా కూతురుని నేను నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని ప్రతాప్ ఫిక్స్ అవుతాడు.. నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొని వెళ్లి ఈ ఛాలెంజ్ లో నేనే గెలవాలి అని ప్రతాప్ అనుకుంటాడు.

మా పెద్ది చేతివంట తినేసి వెళ్ళాలి..

Advertisement

ప్రతాప్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా పెద్ది మాధవ్ తో సైగలు చేస్తాడు.. అమ్మ మహాలక్ష్మి మీ నాన్న భోజనం చేసి వెళ్తాడేమో అడుగు అని అంటాడు.. ఏంటి మీరిద్దరు సైకిల్ చేసుకుంటున్నారు డైరెక్ట్ గానే నాతో మాట్లాడండి అని ప్రతాప్ అంటాడు.. మీరు భోజనం చేసి వెళ్తారా అని అడగమని చెప్తున్నాడు నాన్న అని మహాలక్ష్మి అంటుంది. భోజనం చేయడం మాత్రమే కాదు ఈ రాత్రి ఇక్కడే ఉంటాను అని ప్రతాప్ అంటాడు. ఆ మాట వినగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. వాళ్ల నాన్న ఇన్ని రోజుల తర్వాత రావడంతో తన ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి.

చక్రీకి మైండ్ బ్లాక్..

సాయంత్రం అవ్వగానే చక్రి అలాగే కేశవ ఇంటికి వస్తారు. అయితే ఇంటి దగ్గర కారు ఉండడం చూసి ఎవరిది కారు అని ఆలోచిస్తూ ఉంటారు. నారాయణని కొత్తగా ఎవరు వచ్చారు మన ఇంటికి అని కేశవ అడుగుతాడు.. నా వియ్యంకుడు వచ్చాడు రా అని చెప్పగానే కేశవ ఏంటి ఎవరితో ఏ గొడవలు పెట్టుకొని వచ్చావో ఏం మాట్లాడుతున్నావు తాగింది ఇంకా దిగలేదా అని అంటాడు. నా కోడలు వాళ్ళ నాన్నగారు వచ్చారు అని చెప్పగానే చక్రి కేశవ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రతాప్ వచ్చాడు అంటే మహాలక్ష్మిని తీసుకుని వెళ్తాడేమో అని చక్రి కంగారు పడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..అయ్యో రామరాజు కన్నీళ్లు.. నర్మదకు దిమ్మతిరిగే షాక్..

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×