E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..అయ్యో రామరాజు కన్నీళ్లు.. నర్మదకు దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..అయ్యో రామరాజు కన్నీళ్లు.. నర్మదకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 23rd: రెండు ముక్కలైందని బాధపడుతూ ఉండగా.. బయట భద్రావతి అలాగే సేన ఇద్దరు కూడా టపాసులు పేలుస్తూ చాలా సంతోషంగా ఉంటారు. వీళ్లు టపాసులు పేలుస్తూ ఉండడం చూసి అందరూ ఏమైందని బయటకు వస్తారు. ఈ పనోడి కుటుంబం రెండు ముక్కలవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్రావతి ఆనంద పడిపోతూ ఉంటుంది. వచ్చేటప్పుడు అనాధనే కానీ వెళ్లేటప్పుడు మాత్రం నా వెనకాల ఒక పెద్ద కుటుంబమే ఉంది అని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాడు.. ఇప్పుడు ఇల్లు రెండు ముక్కలైంది ఇది నేను ఆనందించాల్సిన విషయం అని భద్రవతి అనగానే వేదవతి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. కానీ భద్ర మాత్రం నా తీరు నాదే నా పగ నాదే అని అంటుంది.

ఫిట్టింగ్ పెట్టేసిన శ్రీవల్లి..

ఇంట్లో పుల్ల పెట్టాం కదా అని శ్రీవల్లి చాలా సంతోషంగా ఇంట్లోకి వెళుతుంది.. ఇంట్లో ఎలాంటి మంట పెట్టాలో అలాంటి మంట పెట్టేసాము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అని శ్రీవల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. అత్త నువ్వు నాకు పాలాభిషేకం లాంటివి ఏమీ చేయొద్దు అని సుకన్య భాగ్యంతో అనగానే బంగారం లాంటి ప్లాన్ చెడగొట్టేసావు అని భాగ్యం ఇంకాస్త రెచ్చిపోతుంది.. నీవల్లే ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు లేకపోతే ఈపాటికి నర్మదా తట్ట పుట్ట సర్దుకుని ఎప్పుడో వెళ్లిపోదని భాగ్యం సుకన్య అని కొడుతుంది.. వాళ్ళు వెళ్ళిపోతే రివెంజ్ తీసుకునే వాళ్ళం కాదు కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి అనడంతో భాగ్యం ఏదైనా చేసుకోండి అని అంటుంది..

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Advertisement

ఇల్లు రెండు ముక్కలైందని తలుచుకొని బాధ పడిపోతూ ఉంటాడు రామరాజు. తాను తెచ్చిన బొమ్మలు తన కుటుంబమని అవి ఇప్పుడు విరిగిపోయాయి అని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడ గీత ఉండడం చూసిన రామరాజు తన కన్నీళ్ళని ఆపుకోలేక ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటాడు. ఏంటండీ మీరు ఇలా బాధపడి పోతున్నారు మన చేతుల్లో ఏమీ లేదు కదండీ అని వేదవతి అంటుంది.. ఈ బొమ్మలు నా కుటుంబం అని అన్నాను. కానీ ఇప్పుడు ఇవి చెల్లాచెదురుగా పడిపోయి విరిగిపోయి ఉన్నాయి. నా కుటుంబం కూడా ఇలానే ముక్కలైపోతున్న ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు..

సాగర్ ను ఆపే బాధ్యత నాదే..

మీ వాళ్ళ అన్నట్టుగా అనాధగా వచ్చిన నేను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయి అనాధ గాని చనిపోతానా బుజ్జమ్మ అని వేదవతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు. అయితే రామరాజు బాధపడుతుండడం చూసిన వేదవతి మీరు అలా బాధపడకండి ఎప్పుడు లేనిది ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏంటి అని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.. ఆ దేవుడు మనకు ఎప్పుడు అన్యాయం చేయడండి. కుటుంబ నీ ముక్కలు చేయకుండా ఆపుతాడు.. మీరు ఎంతో కష్టపడి నిర్మించుకొని ఈ సామ్రాజ్యం ఎక్కడికి పోదు మీరు మాత్రం బాధపడకండి అని వేదవతి రామరాజుకి ధైర్యం చెబుతుంది..

సాగర్ మాటకు నర్మద షాక్..

Advertisement

ప్రేమ నర్మదక్క వాళ్ళు వెళ్లిపోతారని నేను చాలా కంగారుపడ్డాను రా చాలా భయపడ్డాను కూడా.. ఈరోజు వాళ్ళు వెళ్లలేదు వెళ్ళిపోయి ఉంటే నేను చాలా బాధపడేదాన్ని అని ప్రేమ ధీరథ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది ఇక ధీరజు నువ్వు అంటుకుంటున్నట్టు నర్మద వదిన సాగర్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు అని ధీరజ్ అంటాడు ఎప్పుడు లేనిది ఈ కుటుంబం ఇలా మారిపోవడం చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది రా ఏం జరుగుతుందో అని ప్రేమ ధీరజ్ అంటుంది.. నువ్వు అనుకుంటున్నా టు ఈ ఇంట్లోనే మనం శాశ్వతంగా ఉండాలని అనుకోవడం లేదు.. అమూల్య పెళ్లి అయ్యేంత వరకే ఇంట్లో ఉండాలి ఆ తర్వాత ఆస్తిని పంచిన తర్వాత వెంటనే మనం ఇంట్లోంచి వెళ్ళిపోతాము ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని సాగర్ నర్మదకు వార్నింగ్ ఇస్తాడు.

అమూల్య పై విశ్వం రివేంజ్..

జైలు నుంచి బయటకు వచ్చిన విశ్వం అమూల్య పై ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చాలా కోపంగా ఉంటాడు.. అమూల్య నన్ను జైలుకు పంపిస్తుందా దాని జీవితం మీద నేను కొట్టాలి.. దాన్ని నలుగురిలో తలెత్తుకోని విధంగా చేస్తాను.. ఇవాళ కాలేజీలో జరిగింది దానికి బుద్ధి వచ్చినట్లు ఉంది.. ఇక జీవితాన్ని ఎలా నాశనం చేస్తానో చూడాలి అని విశ్వం అమూల్యని చెడగొట్టే ప్లాన్లో ఉంటాడు.. అమూల్య కాలేజీలో జరిగిన విషయం ఇంట్లో చెప్తే అందరూ బాధపడి పోతారు ఆ విశ్వం నీ చంపేస్తారు అని కంగారు పడిపోతూ తనలో తనే బాధపడిపోతూ ఉంటుంది. ఇంట్లో గీత రావడం చూసి అందరూ బాధపడిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి మరో షాక్.. రాజేశ్వరి పై అనుమానం.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

Big Stories

Advertisement
×