Podarillu Chakri : తెలుగు చానల్స్ లలో బోలెడు సీరియల్ ప్రసారమవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటేనే ఉంది. కొత్త సీరియల్స్ తో పాటుగా పాత సీరియల్స్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. ప్రతి సీరియల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ రావడంతో జనాలు కూడా పెట్టింది చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత ఏడది ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీరియల్ లో నటించిన హీరో చక్రి గురించి రోజుకు వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా చక్రి సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు వినిపిస్తున్న వార్తల పై ఒక క్లారిటీ అయితే వచ్చింది. సీరియల్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది అంటూ ఇప్పుడు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే చక్రి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా? లేదా? ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా అన్నది కాస్త వివరాలు తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ పోదరిల్లులో హీరో పాత్రలో నటిస్తున్న చక్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఈయన నటనకు మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి . నిజానికి ఈ హీరో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినవాడు కాదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించాడు చక్రీ అసలు పేరు దీపక్ కుమార్.. తమిళ ఇండస్ట్రీని నుంచి వచ్చిన ఈ హీరో కి అక్కడ పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే చక్రికి ఓ మంచి తమిళ సినిమాలో అవకాశం వచ్చింది అని ప్రస్తుతం ఓ వార్త షికారు చేస్తుంది ఈ క్రమంలో ఈ హీరో సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని తెలుస్తుంది. మరి నిజంగానే చక్రి సీరియల్స్ కి గుడ్ బై చెప్తాడా అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి.. ఇది కేవలం గాలి వార్తలే అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై చక్రి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
మొన్నటి వరకు హీరోయిన్ అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి మాత్రమే తెలుగులోకి వచ్చేవారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈమధ్య తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. కానీ ఇటీవల కాలంలో హీరోలు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి రావడంతో జనాలకి కాస్త అసంతృప్తి ఉన్న కూడా వాళ్ళ నటనతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ వస్తున్న సరే హీరోలకు హీరోయిన్లకు డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే తమిళంలో పలు సీరియల్స్లలో నటించిన హీరోలు తెలుగులో హీరోలుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. గత కొన్ని రోజులుగా పొదరిల్లు సీరియల్ లో హీరోగా నటిస్తున్న దీపక్ కుమార్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన సినిమాల్లోకి వెళ్ళబోతున్నాడు అంటూ టాప్ నడుస్తుంది మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే అతను రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే దీపక్ కుమార్ కి ఒక్క రోజుకి దాదాపు 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం..