Podarillu TRP Rating : తెలుగు ఆడియన్స్ సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ ని ఆదరిస్తున్నారు.. ఏడాదికి ఎప్పుడో ఒకటి వచ్చే సినిమాలతో పోలిస్తే ప్రతి రోజు టీవీలలో కనిపించే సీరియల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు.. అందుకే ఈ మధ్య కొత్త సీరియల్ వచ్చినా కూడా మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ప్రతిరోజు తెలుగు ఛానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ విపరీతంగా క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి.. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్స్ మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందులో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ సీరియల్స్ తో పోటీ పడుతుంది.. ఈ సీరియల్ యొక్క జూన్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ లను ఒకసారి గుర్తు చేసుకుందాం..
నలుగురు అబ్బాయిలు ఉన్న ఇంటికి ఒక అమ్మాయి వెళ్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఊర్లో జనాలు ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు అన్న స్టోరీ లైన్ తో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ జూన్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి కోసం చక్రి ఒక స్కూటీని కొంటాడు.. అంతకన్నా ముందు చక్రీ రాంగ్ రూట్లో వచ్చాడని ఒక వ్యక్తి పలుకుబడిన ఉపయోగించి జైల్లో పెట్టించేలా చేస్తాడు. ఇక అన్నదమ్ములు చక్రిని బయటకు తీసుకుని వస్తారు.. స్కూటీ కోసం దాచిన డబ్బులు కేశవ చక్రీ కోసం వాడడంతో చాలా సీరియస్ అయిపోతాడు. నేను అస్సలు దీన్ని ఊహించుకోలేకపోతున్నాను నా గురించి తెలిస్తే నువ్వు ఇలా చేసావని బాగా కొట్టుకుంటారు.. అయితే తర్వాత రోజు వాళ్ళిద్దరూ కలిసి పోవడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు.
మొత్తానికి మహాలక్ష్మికి కొన్న స్కూటీతోనే డ్రైవింగ్ నేర్పిస్తారు. అయితే చక్రిని మహాలక్ష్మి పట్టించుకోలేదు అని బాధని దిగమింగుకుంటూ మందు తాగేసి ఇంటికి వస్తాడు.. ఇక నారాయణ అలాగే ఓంకారేశ్వర్ చెప్పినట్లుగా తన భార్యని తన సొంతం చేసుకోవాలని చక్రి మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. చక్రి మాటలకి బెదిరిపోయిన మహాలక్ష్మి తర్వాత రోజు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లోనే కళ కూడా వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది.. ఇక ఆ తర్వాత చక్రీ ఆమెకు సారీ చెప్పడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రిని కోపంగానే చూస్తుంది. కేశవ శైలు ప్రేమని పొందుతాడా లేదా అన్నా సస్పెన్స్ కి తెరపడింది.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ తెగ తిరిగేస్తూ ఉంటారు.
మహాలక్ష్మి తో తప్పక ప్రవర్తించారని తెలుసుకున్న చక్రి ఆమెకి ఎలాగైనా సరే క్షమాపణ చెప్పాలని అనుకుంటాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి చేసింది తప్పే అని అతనిపై కోపంగా ఉంటుంది. శైలు కేశవ ఇద్దరూ కలిసిపోతారు. తమ ప్రేమలో మునిగిపోయి విహరిస్తూ ఉంటారు. అటు చక్రి మహాలక్ష్మి మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కన్నాకి జ్వరం రావడంతో మహాలక్ష్మి కన్నా ని చూడ్డానికి మళ్లీ బృందావనంలో అడుగుపెడుతుంది.. చక్రి భార్య వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఎలా వచ్చింది అని అందరూ అడుగుతూ ఉంటారు.. కానీ తాయారు మాటలకు మహాలక్ష్మి చాలా బాధపడిపోతుంది. ఇవాల్టి ఎపిసోడ్ లో మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చేస్తుంది.. మరి అక్కడే ఉండి పోతుందా లేదా వెళ్ళిపోతుందా అన్నది చూడాలి..