Aaryavir Sehwag Video Call: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026 ) విజేతగా టీం ఇండియా నిలిచింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన ఆర్యవీర్ సెహ్వాగ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. నిన్న మ్యాచ్ ముగిసిన వెంటనే తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ కు (Virender Sehwag) ఆర్యవీర్ (Aryavir) వీడియో కాల్ చేసి కూడా మాట్లాడాడు. ఈ సందర్బంగా పాకిస్తాన్ పై విజయం సాధించడం తన ఆనందాన్ని తండ్రి వీరూతో పంచుకున్నాడు. ఈ తరుణంలోనే కొడుకు చేసిన వీడియో కాల్ ను సోషల్ మీడియాలో పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ఎమోషనల్ అయ్యాడు.
పప్పా…పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ సందర్భంగా తాను చాలా కంగారు పడ్డానని… కానీ సీతారాం సీతారాం అని జపిస్తూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నానని వీడియో కాల్ లో ఆర్యవీర్ తెలిపాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగిందని తన తండ్రి సెహ్వాగ్ తో వివరించాడు. సీతారాం జపంతో పాకిస్తాన్ ను ఓడించడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఎళ్లవేళలా మీరంతా కష్టపడుతూ మరిన్ని ట్రోఫీలు దక్కించుకోవాలని కోరుతూ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీంతో వీళ్ళ సంభాషణ వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==