E-Paper
Advertisement

యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న బుల్లితెర నటి?

యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న బుల్లితెర నటి?
Advertisement

Shobha Shetty:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు పాపులారిటీ ఉంటే చాలు అవకాశాలు లేకపోయినా ఆర్థికంగా ఎదుగుతున్నారు అనడానికి కొంతమంది బుల్లితెర నటీమణులు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీరియల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన ప్రముఖ బ్యూటీ శోభాశెట్టి ప్రస్తుతం ఎలాంటి సీరియల్స్ చేయకపోయినా.. లక్షల్లో సంపాదిస్తూ తన ఆర్థిక స్థితిగతులను మార్చుకుంది.. మరి యూట్యూబ్ ద్వారా శోభా శెట్టి సంపాదిస్తున్న ఆదాయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది.

సీరియల్స్ లేకపోయినా భారీ సంపాదన..

అసలు విషయంలోకి వెళ్తే… కార్తీకదీపం సీరియల్ తో మోనిత పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది శోభా శెట్టి . ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి.. విజేతగా నిలవకపోయినా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కొంతమేర నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్తీకదీపం 2 నుంచి ఈమెను తప్పించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 11 కన్నడలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించక హోస్ట్ కిచ్చా సుదీప్ ను బ్రతిమలాడి మరీ బయటకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం మరే సీరియల్ లో కనిపించడం లేదు.

యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం..

Advertisement

అయితే సీరియల్స్ చేయకపోయినా. అప్పుడప్పుడు టీవీ షోలు , ప్రోగ్రాంలలో సందడి చేస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ తో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమెకు భారీగా ఆదాయం వస్తుందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. యూట్యూబ్ ఛానల్ కు సుమారుగా 7.07 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటూ ఉంటుంది. ఆ వీడియోలకి అటు యూట్యూబ్లో మంచి ఆదరణ కూడా లభిస్తోంది.

నెలకు 10 లక్షలకు పైగా ..

ఈ నేపథ్యంలోనే ఒక్కో వీడియో కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి . వీటి ద్వారా నెలకు సుమారుగా 10 లక్షల వరకు ఆదాయం వస్తోందని సమాచారం. ఒక సీరియల్ లో నటించినా సరే ఇంత ఆదాయం రాదని , ఈమెకు యూట్యూబ్ మంచి ఆదాయ వనరుగా మారిందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె డిజైనర్ స్టూడియోని ప్రారంభించింది. ఈ స్టూడియో ద్వారా కూడా శోభా శెట్టి భారీగా సంపాదిస్తోంది. అలాగే పలు జువెలరీ బ్రాండ్లకు ప్రమోటర్ గా కూడా మారింది శోభాశెట్టి.

Advertisement

ALSO READ:Pradeep Ranganathan: పెళ్లి ఎవర్ని చేసుకోవాలో కూడా ఏఐ చెబుతుందేమో -ప్రదీప్!

శోభా శెట్టి వ్యక్తిగత జీవితం..

శోభా శెట్టి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. కార్తీక దీపం సీరియల్ లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్న ఈమె.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇక ఎంగేజ్మెంట్ జరిగి రెండు సంవత్సరాలుగా పైగానే అవుతున్నా ఇప్పటికీ వివాహానికి దూరంగానే ఉండడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు తమ పెళ్లి తేదీని బయటపెడతారో చూడాలి.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×