E-Paper
Advertisement

మీ ఇంట్లో అద్దం ఈ 5 చోట్ల ఉందా? అయితే వెంటనే మార్చండి!

మీ ఇంట్లో అద్దం ఈ 5 చోట్ల ఉందా? అయితే వెంటనే మార్చండి!
Advertisement

Vastu Tips: మన నిత్య జీవితంలో అద్దం అనేది ఒక విడదీయలేని భాగం. అయితే.. అద్దం కేవలం మన అందాన్ని చూసుకోవడానికే కాదు. అది ఇంటి శక్తిని ప్రతిబింబించే శక్తివంతమైన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో అద్దాలను సరైన దిశలో.. సరైన ప్రదేశంలో ఉంచితే అదృష్టం కలిసివస్తుంది. అదే పొరపాటున ప్రతికూల ప్రదేశాలలో ఉంచితే.. అది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించి, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అద్దం ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వాస్తు.. ఫెంగ్ షుయ్ సిద్ధాంతాల ప్రకారం.. అద్దం ఒక ‘శక్తి వర్ధకం’. అంటే.. అది దేనిని చూపిస్తే.. దానిని రెట్టింపు చేస్తుంది. అందుకే ఇంట్లో అద్దాల అమరిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అద్దాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కింది 5 ప్రదేశాలలో అద్దాలను ఉంచడం అరిష్టంగా భావిస్తారు.

Advertisement

1. మెయిరన్ డోర్ ఎదురుగా :
ఇంటి ప్రధాన ద్వారం గుండా లక్ష్మీ దేవి , సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీరు మెయిన్ డోర్‌కు సరిగ్గా ఎదురుగా అద్దం తగిలిస్తే.. లోపలికి వచ్చే సానుకూల శక్తి ఆ అద్దంలో ప్రతిబింబించి తిరిగి బయటకే వెళ్ళిపోతుంది. దీని వల్ల ఇంట్లో ఉన్న అదృష్టం బయటకు వెళ్లిపోవడమే కాకుండా.. కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటుంది.

2. మంచానికి ఎదురుగా :
బెడ్ రూమ్‌లో అద్దం ఉండటం సాధారణమే.. కానీ అది మీ మంచానికి ఎదురుగా ఉండకూడదు. నిద్ర పోతున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే.. అది ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి, పీడకలలు, దంపతుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అద్దం మార్చడం వీలుకాకపోతే.. పడుకునే ముందు దానిపై ఒక క్లాత్ కప్పడం మంచిది.

Advertisement

3. వంటగది:
వంటగది అగ్ని మూలకం కలిగి ఉంటుంది. అద్దం నీటి మూలకంగా పరిగణించబడుతుంది. అగ్ని, నీరు పరస్పర విరుద్ధమైనవి. వంట గదిలో.. ముఖ్యంగా పొయ్యి  కనిపించేలా అద్దం ఉంచడం వల్ల ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్ తప్పుతుంది.ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై.. ప్రభావం చూపడమే కాకుండా.. అనవసర ఖర్చులను పెంచుతుంది.

Also Read: రుద్రాక్షను ఎందుకు ధరించాలి? సైన్స్, పురాణాలు ఏం చెబుతున్నాయి?

4. చీకటి మూలలు:
అద్దం ఎప్పుడూ అందమైన, శుభ్రమైన వస్తువులను ప్రతిబింబించాలి. మీరు అద్దం తగిలించిన చోట పాత సామాన్లు, చెత్త లేదా చీకటి కనిపిస్తుంటే.. ఆ ప్రతికూల శక్తి మీ ఇంట్లో రెట్టింపు అవుతుంది.ఇది ఇంట్లో చిరాకులను, నిరాశను కలిగిస్తుంది. అద్దం ఎప్పుడూ ప్రకాశవంతమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూపేలా ఉండాలి.

5. ఒక అద్దానికి ఎదురుగా మరొక అద్దం:
చాలా మంది అందం కోసం గోడకు ఇరువై పులా అద్దాలు పెడుతుంటారు. కానీ ఒక అద్దానికి ఎదురుగా మరొక అద్దం ఉండటం వల్ల “బౌన్స్ బ్యాక్” ఎనర్జీ ఏర్పడుతుంది. అంటే శక్తి ఎక్కడా స్థిరంగా ఉండకుండా రెండు అద్దాల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఇది ఇంట్లో చంచలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

అద్దం అనేది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు.. అది మీ ఇంటి శోభను, అదృష్టాన్ని నిర్ణయించే శక్తి. పైన పేర్కొన్న నియమాలను పాటించడం ద్వారా.. మీరు నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. ఇంట్లో సుఖ శాంతులను నింపుకోవచ్చు. విరిగిన లేదా మసకబారిన అద్దాలను ఇంట్లో ఉంచడం కూడా అరిష్టమని గుర్తుంచుకోండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×