E-Paper
Advertisement

Tollywood: 17 ఏళ్ల కల.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Tollywood: 17 ఏళ్ల కల.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Tollywood:స్రవంతి చొక్కారపు (Sravanthi chokarapu)ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బుల్లితెర చానల్స్ లో ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు పలు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయింది. అంతేకాదు బిగ్ బాస్ లో సందడి చేసి మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు వరుస షోలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది. అలాంటి ఈమె తాజాగా ఒక సినిమాలో నటిస్తోంది.

హే భగవాన్ సినిమా ద్వారా నటిగా పరిచయం కానున్న స్రవంతి..

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా తర్వాత మరోసారి సుహాస్(Suhas ), శివాని నాగారం (Shivani Nagaram) జంటగా నటిస్తున్న చిత్రం హే భగవాన్. 20 ఫిబ్రవరి 2026న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఇటీవల టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. చిత్రం నుండి విడుదల చేసిన టీజర్ హిలేరియస్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
ముఖ్యంగా తండ్రి బిజినెస్ ను టేక్ ఓవర్ చేయాలనే కొడుకు తపన.. అసలు తండ్రి ఏ బిజినెస్ చేస్తున్నాడో కూడా తెలియని కొడుకు.. ఫ్యామిలీ రహస్యం బిజినెస్ కాన్సెప్ట్ లో.. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో స్రవంతి చొక్కారపు నటిస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

17 ఏళ్ల నాటి కల నెరవేరింది..

Advertisement

ఇక ఇదే టీజర్ లాంచ్ ఈవెంట్లో తన ఇన్నేళ్ల కల నెరవేరింది అని చెప్పి ఎమోషనల్ అయింది స్రవంతి చొక్కారపు. ‘హే భగవాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. “నటిగా నేను మాట్లాడుతున్న మొదటి స్పీచ్ కాబట్టి ముందు నా గురించి అందరికీ చెబుతాను.. నా పేరు స్రవంతి చొక్కారపు. నేను అనంతపురం జిల్లా కదిరి నుండి వచ్చాను .నటి అవ్వాలనే ఆశతోనే 2009లో ఇండస్ట్రీకి వస్తే.. నటిగా మారడానికి ఇన్నేళ్లు పట్టింది. హే భగవాన్ తో నటిగా లాంచ్ అవ్వాలని గతంలో రాసిపెట్టి ఉందేమో.. అందుకే ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాను. ఇక ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే దర్శకుడు గోపి నన్ను ఆడిషన్ తీసుకోకుండానే నేరుగా సెలెక్ట్ చేశారు. షూటింగ్ కే పిలిచి ఆయనకు కావాల్సినట్లు నటించేలా చేశారు. పైగా ఈ సినిమాలో నేనే సర్ప్రైజ్. ఇక దాదాపు 17 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరబోతోంది” అంటూ ఎమోషనల్ అయింది స్రవంతి చొక్కారపు. మొత్తానికైతే తన కలను నెరవేర్చుకోబోతున్నానని చెప్పి అందరిని సంతోషపరిచింది.

also read:Mohan Babu: విష్ణుని ఐపీఎస్ చేయాలనుకున్న మోహన్ బాబు.. కానీ?

పవన్ కళ్యాణ్ ప్రోత్సాహమే ఇంత దూరం..

Advertisement

ఇకపోతే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన కొన్ని మాటలను గుర్తు పెట్టుకొని ఈ స్థాయికి వచ్చానని ఆమె తెలిపింది. మనం నడిచే దారిలో గతకులు ఉన్నా సరే ధైర్యంగా ముందడుగు వేసి గమ్యానికి చేరుకోవాలని నాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన చెప్పిన మాటలను గుర్తుగా పెట్టుకొని ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అంటూ తెలిపింది. మరి నటిగా తొలి ప్రయాణం మొదలుపెట్టిన స్రవంతి చొక్కారపు ఇండస్ట్రీలో నటిగా బలంగా పాతుకుపోవాలని ఆశిద్దాం..

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×