Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరితో ఫారెస్ట్‌లోకి వెళ్లిన పార్థు ఎదురుగా రాళ్లు కనిపించడంతో కారు ఆపేస్తాడు. రాళ్ల పక్కనే రౌడీలు డైవర్షన్ బోర్డు పెట్టి ఉంటారు. పార్థు కారు దిగి దగ్గరకు వెళ్లి అంతా గమనిస్తుంటాడు. వెనకాలే వెళ్లిన మనోహరి ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టు ఉంది. అందుకే డైవర్షన్ బోర్డు పెట్టారు అని చెప్తుంది. పార్థు మాత్రం అనుమానంగా చూస్తుంటాడు. మనోహరి మాత్రం డైవర్షన్ బోర్డు పెట్టారు కదా పార్థు వెళ్దాం పద అంటుంది. అందుకు పార్థు అనుమానంగా అటు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామో మనం వెళ్లా్ల్సింది నందగిరిహిల్స్ కదా అంటాడు.
ఇటు వెళ్లినా మళ్లీ నందగిరిహిల్స్ రోడ్‌కు కలుస్తుందేమో కదా అంటూ మనోహరి చెబితే.. లేదు మను నాకేదో డౌటుగా ఉంది. దారిదోపిడీ దొంగలు కూడా కొన్ని సార్లు ప్రయాణికులను ఇలా దారి మళ్లించి దోచుకుంటుంటారు. అందుకే అనుమానంగా ఉంది అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. పోలీసోడు పసిగట్టేశాడు అని మనసులో అనుకుంటూ ఏంటి పార్థు నువ్వు ఏం మాట్లాడుతున్నావు.. ఇది టూరిస్టులు వెళ్లే రోడ్డు.. పైగా ఈ రోడ్డు మీద పోలీసుల నిఘా కూడా ఉంటుంది. ఇక్కడ దొంగలు ఉంటారని ఆలోచిస్తున్నావేంటి..? అంటే లేదు మను నా ఆలోచనంతా నీ గురించే అంటాడు పార్థు.. అప్పుడు మనోహరి, పార్థు కళ్లల్లోకి రొమాంటిక్‌గా చూస్తూ.. తన చేతిలోకి పార్థు చేయి తీసుకుని నువ్వుండగా నాకేం అవుతుంది పార్థు అంటుంది. ఆ మాటలకు పార్థు సరే పద మను వెళ్దా అంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తారు.
అమర్ తో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన మిస్సమ్మ కూడా అమర్‌ను ఒప్పించి నందగిరిహిల్స్ వైపు వెళ్తుంటుంది. అమర్‌తో వెళ్తున్న కూడా మిస్సమ్మ, పార్థు గురించి మనోహరి ఏం చేయబోతుంది అనే విషయాల గురించి ఆలోచిస్తుంది. కొద్ది దూరం వెళ్లాక ఎక్కడా పార్థు వాళ్ల వెళ్లిన కారు కనిపించకపోయే సరికి అనుమానంగా మనం వెళ్లేది నందగిరిహిల్స్ వైపేనా అని అమర్‌ను అడుగుతుంది. అమర్ ఎందుకొచ్చింది ఆ డౌటు మనం ఇంతకు ముందు రెండు మూడు సార్లు వెళ్లాం కదా ఇదే ఆ రూట్ అని చెప్తాడు.
మిస్సమ్మ మాత్రం అనుమానంగా ఈ రూట్ అది కానట్టుంది అని అమర్‌తో వాదిస్తుంది. కారు దిగి ఎవరినైనా పార్థు వాళ్ల కారు గురించి ఎంక్వైరీ చేయాలని ప్లాన్ చేస్తుంది మిస్సమ్మ అందుకే అది నందగిరిహిల్స్ రూట్ కాదని వాదిస్తుంది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు పక్కన ఒక వ్యక్తి కట్టెలు ఏరుకుంటుంటే మిస్సమ్మ కారు ఆపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి పార్థు వాళ్ల కారు గురించి అడుగుతుంది. 20 నిమిషాల క్రితం ఇదే రూట్‌లో వెళ్లిందని ఆ వ్యక్తి చెప్పగానే.. మిస్సమ్మ పాస్ట్‌గా కారు ఎక్కి ఇదే రూట్ అంట వెళ్లు అంటూ అమర్‌కు చెప్తుంది.
మరోవైపు డైవర్షన్ తీసుకుని వెళ్లిన తర్వాత కొద్ది దూరంలో రోడ్డు డెడ్ ఎండ్ ఉంటుంది. అది చూసి పార్థు కారు దిగి ఆలోచిస్తుంటాడు. మనోహరి కూడా ఇలా నడుచుకుంటూ వెళ్దామా ఏదైనా రోడ్డు కనిపిస్తుందేమోనని చెప్తుంది. సరేనంటూ పార్థు, మను ఇద్దరు ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తుంటారు. వెనకాలే పార్థును చంపేందుకు రౌడీలు వస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.