E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     
Advertisement

Ninnu kori serial today Episode: స్వీట్లలో మత్తుమందు కలిసి మదన్‌కు తినిపిస్తారు కామాక్షి, శృతి. ఆ స్వీట్లు తిని స్పృహ తప్పి పడిపోతాడు మదన్‌. వెంటనే అక్కడి నుంచి మదన్‌ను స్టోర్‌ రూంలోకి తీసుకెళ్తుంటారు కామాక్షి, శృతి. మందర రావడంతో వెంటనే మదన్‌ను పక్కకు పడేసి ఏమీ తెలియనట్టు చూస్తుంటారు. మందర దగ్గరకు వచ్చి ఏయ్‌ మీరేం చేస్తున్నారు. ముందు జ్యూస్‌లో మందు కలిసారు. తర్వాత నన్ను తల మీద కొట్టారు ఇప్పుడు ఏదో చేస్తున్నారు అంటూ అనుమానంగా చూస్తుంటే.. కామాక్షి, శృతి ఇద్దరు తమ మాటలతో మందరను అక్కడి నుంచి పంపించేసి మదన్‌ను తీసుకెళ్లి స్టోర్‌ రూంలో కట్టేసి వస్తారు.

మండపంలో అందరూ మదన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. చంద్ర సంతోషంగా మదన్‌ ఇంకా రాలేదంటే కామాక్షి, శృతి తమ పనిలో సక్సెస్‌ అయ్యారేమో అని మనసులో అనుకుంటుంది. షాలిని మాయ కూడా మదన్‌ ఇంకా రాలేదేంటి అని కంగారుపడుతుంటారు. పంతులు కూడా మదన్‌ను వెంటనే రమ్మని చెప్తాడు. వాడు వాషింగ్టన్‌కు వెళ్లి ఉంటాడని విరాజ్‌ చెప్తాడు. అప్పుడే అక్కడికి కామాక్షి, శృతి వస్తారు. వాళ్లను చూసిన చంద్ర హమ్మయ్య మొత్తానికి వీళ్లు ఏదో చేశారు అది చాలు నాకు అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

మదన్‌ కోసం అందరూ ఇంట్లో వెతుకుతుంటారు. ఎక్కడా మదన్‌ కనిపించడదు. దీంతో విరాజ్‌ చెప్పానా వాడు ఎప్పుడో ఫ్లైట్‌ ఎక్కి ఉంటాడు అంటాడు. క్రాంతి, షాలిని వెళ్లి స్టోర్‌ రూంలో చూడబోతుంటే.. కామాక్షి, శృతి వెళ్లి తాము స్టోర్‌ రూంలో చూశామని అక్కడ లేడని మీరు మరెక్కడైనా చూడండని చెప్తుంది. సరేనంటూ క్రాంతి, షాలిని వెళ్లిపోతారు. అందరూ మండపం దగ్గరకు వెళ్లి మదన్‌ ఎక్కడా కనిపించడం లేదని చెప్తారు. విరాజ్‌ వెల్లి ఇది విరాజ్‌ అంటే నా దెబ్బకు వాడు ఎక్కడికో పారిపోయాడు అని చెప్తాడు. చంద్ర మాత్రం బాధపడినట్టు యాక్టింగ్‌ చేస్తుంది. పంతులు గారు ముహూర్తం ఉందా ఇంకా అని అడిగితే ముహూర్తం అయిపోయింది. దుర్మూహూర్తం వచ్చింది. నెల రోజుల దాకా ముహూర్తమే లేదు అని చెప్పి వెళ్లిపోతాడు.

చంద్ర తనకు ఘోరమైన అవమానం జరిగింది. ఇక్కడకు వచ్చిన బంధువులు ఏమనుకుంటారు నేను దురదృష్టవంతురాలిని అనుకుంటారు అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. విరాజ్‌ ఇక ఎంగేజ్‌మెంట్ లేదు ఏం లేదు చంద్ర నా భార్యే అందరూ వెళ్లిపోండి అంటూ అందరిని పంపిచేస్తాడు. అందరూ మరి మదన్‌ ఎక్కడికి వెళ్లినట్టు అని ఆరా తీస్తుంటే.. ఇది కచ్చితంగా కామాక్షి, శృతిల పనే అంటుంది. అందుకు కామాక్షి, శృతి మేమా..? ఏం మాట్లాడుతున్నావు అంటూ అడిగితే.. మీరే కదా నన్ను కింద పడగొట్టింది.. మీరే కదా జ్యూస్‌లో మత్తు మందు కలిపింది. మీరే ఏదో చేసి ఉంటారు అంటూ మందర చెప్తుంది.

Advertisement

అప్పుడే స్టోర్‌ రూంలో స్పృహలోకి వచ్చిన మదన్‌ డోర్‌ కొడుతూ అందరినీ పిలుస్తుంటాడు. వెళ్లి డోర్‌ తీయగానే.. మదన్‌ బయటకు వస్తాడు. కామాక్షి, శృతి ఇద్దరూ కలిసి తనకు మత్తు మందు కలిపిన స్వీట్లు తినిపించి స్టోర్‌ రూంలో కట్టేశారని చెప్తాడు. జగదీశ్వరి కోపంగా కామాక్షి, శృతిలను తిడుతుంటే.. ఇదంతా వాళ్లు చేయలేదు ఆంటీ వాళ్లతో ఇదంతా చేయించింది విరాజ్‌ అంటూ మదన్‌ చెబితే.. కామాక్షి, శృతి కూడా అవును విరాజ్‌ చెబితేనే చేశామంటారు. విరాజ్‌ మాత్రం కోపంగా నేను మదన్‌ను డైరెక్టుగా చంపేస్తాను కానీ ఇలా ఎందుకు చేస్తాను అంటాడు. అందరినీ అక్కడి నుంచి పంపిచేస్తాడు విరాజ్‌. మదన్‌ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు.

తర్వాత క్రాంతి బయటకు వెళితే షాలిని కంగారు పడుతుంది. ఎక్కడికి వెళ్లాడో అర్థం కావడం లేదని జగదీశ్వరి వాళ్లకు చెప్తుంది. అప్పుడే క్రాంతి బయటి నుంచి వస్తాడు. చెప్పి వెళ్లోచ్చు కదా అంటే సరే చెప్తాను కానీ అందరినీ పిలువు అంటూ షాలినికి చెబితే షాలిని అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చాక జగదీశ్వరి గురించి తన ఫ్రెండ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌కు చెప్పానని.. మాయ కడుపులో పెరుగుతున్న బిడ్డ షాంపుల్‌తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విషయం తెలుసుకోవచ్చని చెప్పాడని క్రాంతి చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. షాలిని మాత్రం ఇది జరగకూడదు అని మనసులో అనుకుంటుంది. మాయ మాత్రం అందుకు ఒప్పుకుంటుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×