Dragon Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు.. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఏదొక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు వినిపించిన రూమర్స్ పై టీమ్ ఎక్కడ క్లారిటీ ఇచ్చినట్లు లేదు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాసింది. ఆ చిన్న వీడియోలో ఎన్టీఆర్ కనిపించిన రా అండ్ రస్టిక్ లుక్, అలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ పలికిన తీరు, యాక్షన్ మోడ్ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ఆ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.. దీంతో పాటుగా సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ పై రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు..
స్టార్ హీరోల సినిమాలకు రూమర్స్ వినిపించడం కామన్. కానీ ఈ మధ్య ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కి సంబంధించి అనేక వార్తలు వినిపించాయి.. అయితే ఎన్టీఆర్ కి గాయమైనప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ గురించి అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ సర్జరీ జరగడం వల్ల షూటింగ్ కు దూరం అయ్యాడు. దాదాపు 8 వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో రోజుకో రూమర్ వినిపించింది. షెడ్యూల్స్‌లో జరిగిన మార్పుల వల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాదని ఊహగానాలు మొదలయ్యాయి. దాంతో సినిమా ఎప్పుడొస్తుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రాగన్ మేకర్స్ రూమర్స్ కు చెక్ పెట్టారు. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ రూమర్స్ కి చెక్ పెట్టేసింది. సినిమా విడుదల తేదీలో ఎటువంటి మార్పులు లేవని వెల్లడించింది. ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు..
చేయికి గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న ఎన్టీఆర్ మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ కు హాజరుకానున్నారని సమాచారం.. ఇకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం టాకీ పార్ట్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య ఈయన మేకింగ్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో కనిపించేవి. కానీ ఈ సినిమాకి కలర్ ఫుల్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సినిమా టైం కి రాబోతుందన్న వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. తమ హీరో సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ కు జోడీ కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజు వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ స్టోరీ తో వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోని ఒక మైండ్ స్టోన్ గా మిగిలిపోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..
Also Read :మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?