E-Paper
Advertisement

కార్తీకదీపం2లోకి పవర్ఫుల్ లేడీ విలన్.. మూవీస్, సీరియల్స్, బిగ్ బాస్..అబ్బో ఈమె బ్యాగ్ గ్రౌండ్ చూసారా?

కార్తీకదీపం2లోకి పవర్ఫుల్ లేడీ విలన్.. మూవీస్, సీరియల్స్, బిగ్ బాస్..అబ్బో ఈమె బ్యాగ్ గ్రౌండ్ చూసారా?
Advertisement

Karthika Deepam 2:బుల్లితెర ప్రేక్షకులను ఎవరిని అడిగినా తమ ఫేవరెట్ సీరియల్ కార్తీకదీపం అనే చెప్తారు. అలా ఏడు సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రేక్షకులను అలరించింది ఈ సీరియల్. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీకదీపం2 నవ వసంతం పేరిట సీక్వెల్ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 700కు పైగా ఎపిసోడ్లు పూర్తిచేసుకుని దిగ్విజయంగా దూసుకుపోతున్న ఈ సీరియల్.. అనూహ్యంగా సరికొత్త మలుపు తీసుకుంది. కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పవర్ఫుల్ లేడీ విలన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

కార్తీకదీపం 2 సీరియల్ లో పవర్ఫుల్ విలన్ పాత్ర..

వంటలక్క, కార్తీక్ బాబు, జ్యోత్స్న, పారిజాతం వంటి పాత్రలతో పాటు సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర కూడా జనాలను మెప్పిస్తోంది. ఇప్పుడు ఈ కథలో కార్తీక్ పాత్ర కంటే కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర చుట్టూ కథ బాగా నడుస్తోంది. ఈ క్రమంలోనే శివన్నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి దీపతో పాటూ సవాల్ కి సిద్ధమంటూ కథలోకి మరో లేడీ విలన్ అడుగుపెట్టింది. శివ నారాయణ శత్రువు సుమిత్ర తండ్రి దక్షిణామూర్తి కోడలిగా మాలిని అనే ఒక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ పాత్రలో నటిస్తున్న ఆమె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరిస్తున్నారు. మరి మాలిని ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎవరీ మాలిని?

Advertisement

మాలిని పాత్రలో నటిస్తున్న ఆమె పేరు తేజస్విని ప్రకాష్. కన్నడ చిత్ర సీమలో బలమైన నేపథ్యం కలిగిన ఈమె.. కన్నడ ఇండస్ట్రీలో పేరు మోసిన పాపులర్ స్టంట్ మాస్టర్ ప్రకాష్ కూతురే ఈ తేజస్విని ప్రకాష్. ఈమె తల్లి పేరు వినయ. ఆమె కూడా కన్నడ బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నిహారిక, నన్నరసి రాధే వంటి సీరియల్స్ తో పాటు రియాలిటీ షో కన్నడ బిగ్ బాస్ సీజన్5 లో కూడా కంటెస్టెంట్ గా అలరించింది. ఇక సీరియల్స్ , బిగ్ బాస్ మాత్రమే కాదు సినిమాలలో కూడా నటించింది. కన్నడ వెండితెరపై స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. గూలిహట్టి, గజ, అంబుట్టు ఇంబుట్టు ఎంబుట్టు వంటి ఎన్నో సినిమాలలో నటించింది.

ALSO READ:మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..

తెలుగు చిత్రాలలో కూడా నటిగా గుర్తింపు..

Advertisement

పేరుకే కన్నడ నటి అయినా తమిళ్, తెలుగు చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తన పేరును తనిష్కగా మార్చుకొని సినిమాలు కూడా చేసింది. కట్ చేస్తే, సినిమా మహల్ -రోజుకి నాలుగు ఆటలు , ప్రతిక్షణం వంటి చిత్రాలలో నటించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇంతకాలం తర్వాత కార్తీకదీపం 2 సీరియల్ లో మాలిని అనే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ముఖ్యంగా సినిమాలతో ప్రేక్షకులను అబ్బురపరిచిన తేజస్వి ప్రకాష్ తన అద్భుతమైన విలనిజంతో ఈ కార్తీకదీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరుగుదలకు ఏ విధంగా సహాయపడుతుందో చూడాలి.

Related News

Illu Illaalu Pillalu : సీరియల్ లవర్స్ కు షాక్.. ఫైనల్ స్టోరీ ఇదేనా..?

Podarillu Today Episode : శైలుకు రేపే పెళ్లి.. మహాను చూసి ఫిదా.. పెద్దోడికి జోడీ దొరికేసిందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మనసులో ఇంత కుట్ర.. కన్నీళ్లు తెప్పించే సీన్.. బాలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?

Illu Illalu Pillalu Today Episodes: రేవతి మాటతో మారిన ప్రేమ.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. సాగర్ కు షాక్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు కడుపు మంట.. ఇంట్లోని వాళ్లకు అవని షాక్.. అవని ప్లాన్ ఫెయిల్..

Karthika Deepam 2 Serial Today Episode August 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన జ్యోత్స్న    

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Brahmamudi Serial Today Episode August 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను అడుక్కోమని బొచ్చ ఇచ్చిన శేషు 

Big Stories

Advertisement
×