E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కొత్త ఇంట్లోకి వచ్చేసిన అవని కుటుంబం.. పల్లవికి మైండ్ బ్లాక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ..

Intinti Ramayanam Today Episode: కొత్త ఇంట్లోకి వచ్చేసిన అవని కుటుంబం.. పల్లవికి మైండ్ బ్లాక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ..
Advertisement

Intinti Ramayanam Today Episode july 9th: ఎన్నో అనుబంధాలని అవమానాలని, మరెన్నో జ్ఞాపకాలని మిగిల్చిన ఈ ఇల్లు వదిలి వెళ్లాలంటే ఏదోలా ఉంది.. ఇక్కడ మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. మనకు ఇదొక బడి లాంటిది.. ఎన్నో తప్పులను కూడా సరిచేసింది అని అవని ఆ ఇంటిని చూసి ఎమోషనల్ అవుతుంది.. ఇక ఇంటి ఓనర్ రాగానే ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అక్షయ కూడా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తాడు.. అదేవిధంగా ఆయన కూడా మీలాంటి మంచి మనసులు నా ఇంటిని వదిలి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. ఇకపోతే ఆ ఇంటి నుంచి అందరూ ఎవరి కార్లలో వాళ్ళు ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతారు.

భరత్ ను చూసి మీనాక్షి ఎమోషనల్..

మీనాక్షి అలాగే చక్రవర్ ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వెళ్లి అన్ని సిద్ధం చేసి పెట్టి ఉంటారు. వీళ్ళెంటండి ఇంకా రాలేదు అని మీనాక్షి అడుగుతుంది.. నేను ఇందాకే అక్షయ్ కి ఫోన్ చేస్తాను కాసేపట్లో వచ్చేస్తాము అని చెప్పారు అని చక్కధర్ అంటాడు. అయితే భరత్, ప్రణతి ఇద్దరూ రావడం చూసి మీనాక్షి సంతోషంగా ఉంటుంది.. భరత్ ప్రణతి ఇంట్లోకి రాగానే మీనాక్షి భరత్ను పట్టుకొని ఎలా ఉన్నావురా అని ప్రేమగా పలకరిస్తుంది.. భరత్ తల్లిని చూసి చాలా సంతోషంగా ఉంటాడు. వీళ్లు వచ్చిన కాసేపటికి మిగిలిన వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరూ ఒకే ఇంటికి రావడం చూసినా మీనాక్షి చాలా సంతోషంగా ఉండండి అని అనుకుంటుంది.. మీనాక్షి మాటలకి ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు..

ఇంట్లో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అవని…

Advertisement

ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరూ కూడా తమకు ఆ ఇంటికాడ ఉన్న అనుబంధం అని ఒకసారి గుర్తు చేసుకుంటారు.. ఆ ఇండ్లు తమకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది అని మరోసారి అనుకుంటూ ఎమోషనల్ అయిపోతారు. ఆ ఇంటి తో తమకున్న సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకుంటారు.. అందరూ కూడా ఆ ఇంట్లో జరిగిన ప్రతి అణువణువుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోతారు.. ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ అని చెప్పాలి.. ప్రగతి మీనాక్షి ఇద్దరు కూడా అందరూ వచ్చారని చాలా సంతోషంగా బయటికి వెళ్తారు.. శ్రేయ బిడ్డను చూసి ప్రణతి సంతోషంగా ఉండడం చూసి అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు.. ప్రణతి ఇంకా అందరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరూ కూడా మన ఇంట్లోకి మనం మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు..

అయ్యో పల్లవి అవసరమా…

అందరూ తమ ఇంట్లోకి వచ్చామని చాలా సంతోషంగా ఉంటారు. మనం మళ్లీ మన ఇంటికి రావడం నాకు ఒక కలలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏదో సాధించాను అని అనుకుంటున్నాను అని పార్వతి చాలా సంతోషంగా ఉంటుంది. పాలు పొంగించాలి అని ముగ్గురు కోడలని వంట గదిలోకి తీసుకొని వెళుతుంది.. అందరూ అక్కడ ఉండగా అవని నీ పాలు పొంగించమని అడగడంతో పల్లవి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అవని అక్క పాలు పొంగిస్తేనే పొంగుతాయా మరి మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు అని పల్లవి అంటుంది. అయితే పల్లవి మాట కాదనలేక అవని పల్లవి తోనే పాలు పొంగించేలా చేస్తుంది.. కానీ ఆ పాలు మాత్రం పగిలిపోతాయి. అది చూసిన శ్రేయ ఎవరి మనసు ఎలాంటిదో పాలకు కూడా అర్థమైంది అందుకే పగిలిపోయాయి అని అంటుంది.. ఆ తర్వాత మళ్లీ అవని పాలు పొంగించిన వెంటనే పొంగిపోతాయి.. దాంతో ఎవరి మనసు ఎలాంటిదో పాలు ఇప్పుడు చూపించింది కదా అవి అక్క పాలు ఎంత బాగా పొంగేయో అని అంటుంది.

అందరికి బట్టలు పెట్టిన మీనాక్షి..

Advertisement

ఇంట్లో పూజకు కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి పెట్టిన మీనాక్షి చక్రధర్లు ఆ పూజకు మొత్తం సిద్ధం చేసి ఇంట్లోని వాళ్ళందరికీ బట్టలు పెట్టాలని అనుకుంటారు. అక్కడికొచ్చిన పూజారి పూజలో కూర్చోవాలి అని అనుకుంటున్నారు వెంటనే తొందరగా బట్టలు కట్టుకొని రావాలి అమ్మ అని అంటారు.. ఇక మీనాక్షి చక్రధర్లు మేము ఈ పూజ కోసం అన్ని సిద్ధం చేశామో అందుకే అందరూ దంపతులకు బట్టలు కూడా తీసుకొని వచ్చాము అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీనాక్షి అలాగే చక్రధర్లు దంపతులుగా అందరికీ బట్టలు పెడతారు. అది చూసిన భరత్ ఓర్వలేక పోతాడు.. ఇక మీరందరూ మేం పెట్టిన బట్టల్ని కట్టుకుని రావాలి అని మీనాక్షి చెప్పి అందరిని పంపిస్తుంది.. ఇక మీనాక్షి కంకణాలను కడుతూ ఉండగా ఇంకా తక్కువయ్యాయి అని చెప్పడంతో మళ్ళీ కట్టాలని అనుకుంటుంది.. చక్రధర్తో కలిసి కట్టడం చూసిన భరత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు..

మీనాక్షి మాటతో భరత్ ఎమోషనల్..

మీనాక్షి చక్రధర్ ఇద్దరు కలిసి కంకణాలు కట్టడం చూసిన భరత్ అమ్మ నేను నీతో మాట్లాడాలి ఒకసారి బయటికి రామ్మా అనేసి పక్కకు తీసుకొని వెళ్తాడు.. అయితే ఏంటమ్మా నువ్వు అతనితో నిజంగానే భార్యాభర్తల్లాగా కలిసి పోయావా..? నీకు కొంచమైన లేదా ఇన్నేళ్లు భర్త లేకుండా ఉన్నావు ఇప్పుడేంటి ఆయన వదల్లేకపోతున్నావు అని మాట్లాడడంతో మీనాక్షి ఎమోషనల్ అయిపోతుంది.. 30 ఏళ్లుగా భర్తకు దూరం ఉన్నాను. ఇప్పుడు భర్తతో కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నానో చాలా సంతోషంగా ఉన్నాను అని మీనాక్షి అంటుంది. ప్రణతి భరత్ ఇలా మారిపోయాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు వదినా అని అవనితో అంటుంది.. నువ్వేం బాధపడకు ప్రణతి నిన్న మొన్నటి వరకు శ్రేయ కూడా అంతే.. ఇప్పుడు తన పూర్తిగా మారిపోయి అందరితో కలిసిపోతుంది. భరత్ కూడా అంటే త్వరలోనే అందరితో కలిసి పోతాడు అని అంటుంది..

పల్లవికి షాకిచ్చిన కమల్…

మీనాక్షి ఇచ్చిన బట్టల్ని పల్లవి తీసుకోదు.. కానీ కమల్ మాత్రం పూజారి ముహూర్తం పెట్టి పూజ చేసి నీకు బట్టలు ఇవ్వాలి ఏంటి ముందు బట్టను తీసుకో అంటాడు. ఇక అందరూ బట్టలు కట్టుకొని పూజ కోసం రెడీ అవ్వాలని అనుకుంటారు.. పల్లవి చేతిలో బట్టలు పట్టుకొని అలానే ఉంటుంది.. ఏంటి ఇంకా బట్టలు పట్టుకొని అలానే ఉన్నావ్ ఏం చేస్తావ్ అని అడుగుతాడు.. తమరు బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటాను అని పల్లవి అంటుంది. కానీ కమల్ మాత్రం నువ్వు ఉండగానే నీ కళ్ళముందునే నేను బట్టలు మార్చుకున్నాను.. నువ్వు కూడా నేను ఉండగానే మార్చుకోవాలి అని కమల్ అనగానే పల్లవి సిగ్గుపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. అందరూ కలిసి పూజలో కూర్చొని పూజని విజయవంతం చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సీరియల్స్ ఇక కనిపించవు..!

Related News

ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

స్కిట్ మొత్తం నైటీలతోనే.. రచ్చ చేసిన సెలబ్రిటీస్!

అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్.. రూల్స్ తెలుసా?

Illu Illaalu Pillalu Narmada : నర్మదా పోస్ట్ ఎవరికోసం..ఎక్కడో తేడా కొడుతుంది సీనా..

Gundeninda GudiGantalu Today episode: మీనా ఎమోషనల్.. శివ కిడ్నాప్.. బాలు, మీనా ఎమోషనల్..

Nindu Noorella Saavasam Serial Today Episode August 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను చితక్కొట్టిన మనోహరి 

Podarillu Today Episode : జంటను విడగొట్టిన చక్రీ.. తాళి కట్టనన్న కేశవ.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: సుకన్యకు వేదవతి షాక్.. ప్రేమకు దొరికిపోయిన ధీరజ్.. సాగర్ గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×