E-Paper
Advertisement

ఏపీని ఊపేస్తున్న ‘ప్రశ్న రావణ్’ కేసు.. అసలు అతని వెనుక ఉన్న ‘ఆ’ పెద్ద హస్తం ఎవరిది?

ఏపీని ఊపేస్తున్న ‘ప్రశ్న రావణ్’ కేసు.. అసలు అతని వెనుక ఉన్న ‘ఆ’ పెద్ద హస్తం ఎవరిది?
Advertisement

Prashna Ravan: ఏపీలో ప్రశ్న రావణ్‌ కేసు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ కేసు చుట్టూ పొలిటికల్‌ బ్లేమ్‌ గేమ్ నడుస్తోంది. తన యూట్యూబ్‌ చానెల్లో రావణ్‌ ఎక్కువగా ఒక వర్గానికి వ్యతిరేకంగా వీడియోలు చేయడంతో.. అతనిని సమర్థించే, వ్యతిరేకించే వార్గాలుగా ప్రజలు విడిపోయారు. అలాగే ఆధ్యాత్మిక లోకం నుంచి రావణ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రావణ్‌ ఫోన్‌లో దేశ ద్రోహ భావజాలం ఉందని.. అశ్లీల వీడియోలు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. రావణ్ తమవాడు కాదంటే.. తమవాడు కాదని.. పార్టీలు బ్లేమ్‌ గేమ్‌కు తెరలేపాయి.

రావణ్ వెనుక జగన్..?

Advertisement

డిప్యూటీ సీఎం పవన్‌పై రావణ్‌ తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం YCPనే అని TDP ఆరోపిస్తోంది. అయితే, అతనితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. అతనెవరో తమకు తెలియదని తేల్చి చెబుతున్నారు YCP నేతలు. దీనికి తగినట్టుగానే అతని వెనుక జగన్‌ ఉన్నాడని.. TDP నేతలు ఆరోపిస్తుంటే.. రావణ్‌ వెనుక YCP ఉందని.. అతనిని సమర్థించడం అంటే దేశద్రోహమేనని మాజీ YCP నేత విజయసాయిరెడ్డి కూడా ఎక్స్‌ ద్వారా ఆరోపించారు. ఇక మంత్రి ఆనం ఒక అడుగు ముందుకేసి.. రావణ్‌ను సమర్ధించినందుకు జగన్‌పైనా దేశద్రోహం కేసు పెట్టాలన్నారు.

Also Read: సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

Advertisement

అధికార, విపక్షాల విమర్శలు

అయితే, రావణ్‌ అనే వ్యక్తి ఓ యూట్యూబర్‌ మాత్రమే. కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసమో.. లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసమో ఏదో వివాదాస్పద అంశం వైపు, పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. తప్పు చేస్తే శిక్ష పడాలి అనడం పక్కన పెట్టి.. అతను మీ క్యాంపే, కాదు మీ కోవర్టే అంటూ అధికార, విపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తిని.. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా డిస్కషన్స్‌ జరిగి గుర్తింపు తెచ్చిపెట్టేలా తయారయ్యాయి ఏపీ పాలిటిక్స్‌.

Also Read: బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!

Related News

స్మార్ట్‌గా బురిడీ కొట్టిస్తున్న డీలర్లు.. ఎరువుల యాప్ ఓపెన్ చేసేలోపే ఖాళీ.. ఎలా సాధ్యం?

పునాది వేసింది కాంగ్రెస్.. ముద్ర వేసింది బీజేపీ.. ‘తాడిచర్ల-2’ క్రెడిట్ ఎవరిది?

ఎవరా టాలీవుడ్ హీరో? డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీలో దొరికిన ‘రూ.3 కోట్ల’ సీక్రెట్ డీల్!

15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!

భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

మరో పిడుగు.. E20 స్థానంలో E25 ఇంధనం, ధర తగ్గుతాది ఒకే.. మరి ఆ డ్యామేజ్?

Big Stories

Advertisement
×