Podarillu Today Episode July 9th: నేను ఎన్నిసార్లు చెప్పినా సరే వినట్లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు.. వరాలు ఇలాంటి ఇయ్యాలన్న కొంపకి నా కూతుర్ని ఎలా పంపిస్తానని అనుకుంటున్నారు.అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మనుషులేనా మీరు అని దారుణంగా మాట్లాడుతుంది.. లోపల వరాలు మాట విన్న మహాలక్ష్మి ఒక్కసారిగా బయటికి వచ్చి చిరుత పులి లాగా విజృంభిస్తుంది.. ఈ ఇంటికి ఏ ఆడపిల్ల రాదు అని అంటున్నారు నేను వచ్చాను ఈ ఇంటి ఆడపిల్లనే. నేను చక్రితో తాళి కట్టించుకున్న భార్యని ఇది నా అత్తగారిల్లు అని అనగానే అందరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.. ఆ ఇంటి గురించి మహాలక్ష్మి మాట్లాడిన మాటలు విని మాధవ్తో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషపడతారు.. మహాలక్ష్మి ఒక్క మాటతో వరాలుకి ఫీజులు ఎగిరిపోయేలా చేస్తుంది. మహాలక్ష్మి తో ఇక మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరాలు అలాగే వాళ్ళ భర్త. ఇంట్లోకి వెళ్లిన వాళ్లందరూ కూడా చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు…
శైలుకి ఇంటికి వెళ్ళగానే వరాలు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో తెలుసా? వాడు ఒక ఎదవ అన్న సంగతి నీకు తెలుసా అని వరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత శైలుకి మాట కూడా మాట్లాడనివ్వకుండా తిట్టి పడేస్తుంది. వాడు ఇంటికి వెళ్లి నేను దిమ్మ తిరిగిపోయేలా కడిగి పడేసాను అని వరాలు అనగానే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లారు అడుగుతుంది.. అదేంటే అలా మాట్లాడుతున్నావు.. నువ్వు చేసిన పనికి మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వరాలు శైలుని కొడుతుంది కూడా.. ఇది ఎన్ని చేసినా కూడా నేను ఆ కేసు అని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది.. అయితే శైలు మాట విన్న వరాలు చూశారా ఎంత ముందుగా మాట్లాడుతుందో ఇదంతా మిమ్మల్ని చూసే నేర్చుకుంటుంది అని వరాలు అంటుంది.. చూశారా అది ఎలా మాట్లాడుతుందో దీని అంతటికి కారణం మీరే మీ వల్లే అది ఇంతగా చెడిపోయింది అని శైలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు..
మహాలక్ష్మి ఇది వాళ్ళ ఆదివారం కదా మనం అందరం క్యారం బోర్డ్ ఆడుకుందాం అని అంటుంది.. అందరూ సరదాగా ఇంకా క్యారం బోర్డు ఆడుకుంటూ ఉంటారు.. చక్రి కేశవ ఇద్దరూ ఒక టీమ్ఉండగా కన్నా మహాలక్ష్మి ఇద్దరు మరో టీం గా ఉంటారు.. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అయితే చక్రి మొండోడు బండోడు అని మాకు పేర్లు పెట్టారు కదా అని బాధ పడిపోతూ ఉంటారు.. మహాలక్ష్మి మీరు నిజంగానే అలానే ఉంటారు కాబట్టి మీకు ఆ పేర్లు పెట్టాను అని అంటుంది.. నీ కన్నా నయం రా నాకైతే ఇంకా దారుణంగా బండోడా అని పెట్టింది. నేను అంత ఘోరంగా ఉంటానని కేశవ అంటాడు.. నువ్వు నిజంగా నీ బండోడివి కాబట్టే అలా మాట్లాడింది అందులో తప్పేమీ లేదు కదా అని అంటాడు చక్రి.. అంత ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు. మహా అలా కొట్టుకుంటే దెబ్బలు తగలవు కానీ ఈ క్యారం బోర్డు తీసుకొని కొట్టుకుంటే మీకు మంచిగా దెబ్బలు తగులుతాయి అని అంటుంది.. మహా మాటతో ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోతారు..
మహాలక్ష్మి ఇవాళ ఆదివారం కదా మనమందరం పార్కుకి వెళ్దాం పెద్ది అని అడుగుతుంది.. మహాలక్ష్మి మాట విన్న మాధవ్ సరే అమ్మ అందరం కలిసి ఈరోజు పార్కు వెళ్దామని అంటాడు.. అందరూ కూడా సరే వెళ్లే వద్దాము అని అంటారు.. మాధవ్ పార్కుకి వెళ్తున్నాం కదా మనకు తినేదానికి అక్కడ కూర్చోడానికి ఒక దుప్పటి కూడా పెట్టాలి అని సిద్ధం చేస్తూ ఉంటాడు.. అయితే కన్నా వచ్చి ఏంటన్నయ్య ఈ స్నాక్స్ అన్ని ఈ దుప్పట్లు ఎందుకు అని అడుగుతాడు.. మనం అక్కడికి వెళ్ళినప్పుడు తినడానికి ఉంటాయి కదరా ఆకలి వేయకుండా తినాలి కదా అని మాధవ్ అంటాడు.. మాధవ్ ఆ మాట అనగానే కన్నా ఎందుకన్నా మనం ఇక్కడ ఇన్ని తీసుకొని వెళ్తే ఎవరైనా అమ్ముకునే వాళ్ళు అనుకుంటారు అని ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం పెద్ది చెప్పిందే కరెక్ట్ అని అంటుంది..
కేశవ కి శైలు ఫోన్ చేస్తుంది.. అమ్మ మీ నాన్న మా ఇంటి దగ్గరికి వచ్చిన గొడవ గురించి నీకు తెలుసా? మళ్ళీ నాకు ఫోన్ చేసావ్ ఏంటి నీకు ఎంత ధైర్యమే బాబు అని కేశవ్ అంటాడు.. అయితే శైలు నేను మా అమ్మ అన్నదానికి అన్నం కూడా తినలేదు నేను అలిగాను అని కేశవ తో కాసేపు సరదాగా మాట్లాడుతుంది.. అసలే బక్క చిక్కిన పుల్లలాగా ఉంటావు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే అస్సలు బాగోవు అని కేశవ ఎంత చెప్పినా సరే శైలు మాత్రం నువ్వు తినిపిస్తేనే తింటాను అని అంటుంది. ఫోన్లో తినిపించడం కష్టం కదా అని శైలు తో కేశవ అంటాడు.. అయితే శైలు మనిద్దరం రెస్టారెంట్ కి వెళ్దాము అక్కడ తినిపించవచ్చు కదా అని అంటుంది.. ఇకపోతే శైలు కోసం పార్కుకి వెళ్లకుండా ఉండాలి అని లోపలికి వచ్చిన కేశవా నేను పార్కు రావట్లేదు అన్నయ్య బండి ఇచ్చిన ఆవిడ ఒప్పుకోవడం లేదు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు..
పొదరిల్లు టీ మొత్తం దుర్గం చెరువుకి వెళ్తారు.. అయితే అక్కడ చెకింగ్ లో నారాయణని చెక్ చేస్తూ ఉండగా తన మందు బాటిల్ని మహాలక్ష్మి బ్యాగులో వేస్తాడు.. దాన్ని ఎలాగైనా సరే మళ్లీ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి బ్యాగులో ఏముంది అని తెలుసుకోనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడడంతో నారాయణ ఫీలవుతాడు.. చివరికి నారాయణ బ్యాగులో చేయి పెట్టి తీస్తూ ఉండగా చక్రి వచ్చి దొంగతనం చేస్తున్నావా సిగ్గు లేదా అని అవమానిస్తాడు.. ఇక ఆ బేగం తీసుకున్న మహాలక్ష్మి అందులో మందు బాటిల్ ని చూసి కొంచమైన మీకు బుద్ధి ఉందా అని ఒక్క మాటతో నారాయణకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. పబ్లిక్ ప్లేస్ లో ఇలా తాగడం మంచిది కాదు అని దాన్ని బ్యాగులో పెట్టేసి తర్వాత ఇస్తాను అని అంటుంది.. అదే పార్కుకి కేశవ శైలు కూడా వస్తారు.. మొత్తానికి పొదిరిల్లు ఫ్యామిలీ మొత్తం అదే పార్కులో ఒకరికి తెలియకుండా మరొకరు ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…