Tollywood:సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు? ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. అందుకే సోషల్ మీడియా ఎప్పుడూ వీరిపై ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా జంటగా కనిపించినా లేదా ఎక్కడైనా వెకేషన్స్ లో కలిసి దర్శనమిచ్చినా చాలు.. వారి మధ్య రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే అలా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ ఒక్కొక్కసారి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి.అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు జంటగా కనిపించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను నిజం చేసిన విషయం తెలిసిందే .ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ కపుల్ కూడా వచ్చి చేరనుంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్న చట్టపట్టలేసుకొని తిరిగారు. మీడియా కంట పడకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డారు. కానీ సోషల్ మీడియాలో తమ బంధం పై ఎన్ని పుకార్లు, రూమర్లు వచ్చినా ఏ రోజు స్పందించని ఈ జంట.. దాదాపు 8 ఏళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది విరోష్ అంటూ అభిమానుల ముందు తమ ప్రేమ బంధాన్ని ప్రకటించి , పెళ్లి చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జంట లాగే మరొక జంట కూడా సడన్ సర్ప్రైజ్ ఇవ్వనుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
వారెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్ , లేడీ బ్యూటీ ఈషా రెబ్బ.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో ఓం శాంతి శాంతి శాంతిః సినిమా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఈ సినిమా ముగిసేలోపు వీరి మధ్య ప్రేమ మరింత బలపడిందని, ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ:లెనిన్ మూవీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
దీనికి తోడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి కూడా ఈ జంట స్వయంగా వెళ్లి సందడి చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా ఎయిర్ పోర్ట్ లో ఈషా లగేజ్ మోస్తూ తరుణ్ భాస్కర్ కనిపించిన వీడియోలు అనుమానాలకు తెరలేపాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట అడ్డంగా బుక్ అయ్యింది. హైదరాబాద్ ఎయిర్పోర్టులో పక్కపక్కనే నడుస్తూ కనిపించారు ఈ ప్రేమ జంట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది
ఇకపోతే గతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లాగా రహస్యంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ జంట కూడా త్వరలోనే శుభవార్త చెప్పనుంది అనే ప్రచారం కూడా నెట్టింట జోరుగా సాగుతోంది. మరి ఈ రూమర్స్ పై తరుణ్ భాస్కర్ లేదా ఈషా రెబ్బ స్పందిస్తారో లేదో చూడాలి.
Director #TharunBhascker and Actress #EeshaRebba, the soon to be couple, spotted together at the airport.pic.twitter.com/XBgkFlikJg
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) July 8, 2026