E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మదకు సారీ చెప్పిన వేదవతి.. చందు మాటతో వల్లి ఫ్యూజుల్ అవుట్.. వల్లికి కన్నీళ్లు..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదకు సారీ చెప్పిన వేదవతి.. చందు మాటతో వల్లి ఫ్యూజుల్ అవుట్.. వల్లికి కన్నీళ్లు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 9th: చందు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తప్పు చేశారమ్మా.  అలాంటి దాన్ని మళ్లీ ఇంటికి తీసుకొని వస్తాను అని ఎందుకు అనుకున్నారు.. మీరు దాన్ని తీసుకుని వచ్చి మళ్లీ మళ్లీ తప్పు చేసి నా గొంతు కోయాలని చూస్తున్నారా అని బాధ పడిపోతాడు. నేనెందుకు నీ గొంతుకోస్తారా? నువ్వు ఊరికే బాధ పడిపోతున్నావు అని తను అంటుంది.. వల్లి ఇంట్లోకి రానివ్వడానికి నేను ఒప్పుకుంటాను అయితే నాన్నకి అన్ని నిజాలు చెప్తేనే నేను తనని ఇంట్లోకి రానివ్వమని చెప్తాను అని అంటాడు. మీ నాన్నకి పోరు తెచ్చుకున్న కోడలు కాబట్టి వల్లి అంటే ఎంతో అమితమైన ప్రేమ ఉంది.. వల్లిని ఒక మాట అంటేనే అసలు  ఊరుకోరు.. అలాంటి వల్లి గురించి నిజం చెప్తే ఆయన గుండె పగిలిపోతుంది అని బాధ పడిపోతుంది వేదవతి. ఇక చందు సరే అమ్మ నీ ఇష్టం అని అంటాడు..  అప్పుడే రామరాజు గట్టిగా లోపలి నుంచి కేకలు వేస్తాడు.. శ్రీవల్లి కాఫీ తెచ్చి ఇవ్వడంతో కోడలికి ఆరోగ్యం బాగోలేదు కదా మరి ఎందుకు నువ్వు తన చేత పనులు చేస్తున్నావని రామరాజు సీరియస్ అవుతాడు..

నర్మదకు క్షమాపణలు చెప్పిన వేదవతి…

నర్మదా వంటగదిలో ఉండగా వేదవతి అక్కడికి వెళుతుంది.. ఇన్ని అనవసరంగా లేనిపోని మాటలని చిరాకు తెప్పించాను. బాగా అసహ్యించుకున్నాను కూడా.. ఇది ఇప్పుడు చాలా కోపంగా ఉంది మరి నాతో మాట్లాడుతుందా లేదా అని వేదవతి భయపడుతూనే లోపలికి వెళ్తుంది.. అక్కడ నర్మదా చాలా కోపంగా ఉండడం చూసి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ కోడలు గారు అని కావాలని వెటకారంగా మాట్లాడుతుంది. వినగానే నర్మదా అక్కడ ఉన్న ప్లేట్ ని తీసి విసిరి కొట్టేస్తుంది.. నువ్వు చాలా కోపంగా ఉన్నావని నాకు అర్థమైంది.. నువ్వు అంత కోపం ఉండడానికి నేనే కదా కారణం కానీ ఇప్పుడు ఏదో పొరపాటున అనేసాను.. నన్ను క్షమించవే తప్పుగా అనుకున్నాను అని నర్మదని ఎంతగా బతిమిలాడినా కూడా తాను మాత్రం కోపంగానే ఉంటుంది. చివరికి వేదవతి బతిమిలాడడంతో నర్మదా కూల్ అవుతుంది మళ్లీ ఇద్దరూ మునుపటిలాగే కలిసిపోతారు..

చందు మాటతో వల్లి ఫ్యూజుల్ అవుట్..

Advertisement

శ్రీవల్లి వేదవతీ తనని కోడలుగా గుర్తించడం లేదు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తను ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన చందు అక్కడున్న చాప దిండ్లను తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు.. బావ ఎక్కడికెళ్తున్నావ్ బావ అని అడుగుతుంది శ్రీవల్లి.. నేను బయట పడుకుంటున్నాను ఇకమీదట నుంచి నేను బయటే పడుకుంటాను అని అనడంతో అదేంటి బావ నువ్వు ఇక్కడే పడుకో బావ అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ మాటలతో నన్ను పిచ్చోడిని చేసావు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు.. బిడ్డ ఉందని చెప్పి నన్ను నమ్మించి తండ్రిగా నేను పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టేసావు.. మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిచ్చివాళ్ళని చేసే ఆడుకున్నావు. అలాంటి నువ్వు ఇప్పుడు మారిపోయాను అని అంటే ఎలా నమ్ముతాను ఇంక జీవితంలో నిన్ను క్షమించను అని చందు అంటాడు.. నేను ఇదంతా చేసింది నీకోసమే బావ అని శ్రీవల్లి ఎంతగా బతిమలాడుతున్న సరే చందు మాత్రం నీ మొహాన్ని నాకు జన్మలో కూడా చూపించదు బయటికి మాత్రమే మనం భార్యాభర్తలం అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు..

ప్రేమను ఓదార్చిన ధీరజ్…

ప్రేమ ఒంటరిగా కూర్చుని పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే ఇంకా నిద్ర పోకుండా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నావు అని ధీరజ్ అడుగుతాడు.. రేపు అమూల్య కేసు హీరింగ్ వస్తుంది కదా… అది నిరూపించితే అటు విశ్వంకి జైలు శిక్ష తప్పదు కదా అదే నాకు బాధగా ఉంది రా అని ప్రేమ అంటుంది… ఆ టైము సొంత అన్నయ్య ఇటేమో అత్తవారి ఇల్లు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అని ప్రేమ బాధపడడం చూసిన ధీరజ్ ఇప్పుడు అర్ధరాత్రి వేళా నీకు ఇంత వేదం ఎలా వచ్చింది అని ధీరజ్ ప్రేమని ఎగతాళి చేస్తాడు.. ప్రేమని దగ్గరికి తీసుకొని మీ వాళ్లను కాదని అత్తింటి వాళ్ళకి సపోర్ట్ చేశావు నువ్వు చాలా గొప్ప దానివే తప్పు చేసిన వాళ్ళని క్షమించకుండా ఇలా చేయడం మంచిది అని అంటాడు.. ప్రేమ ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి సాంగ్ వినిపించడంతో బయట తిరుపతికి దగ్గరికి వెళ్తాడు. ఏంటి మామ ఇప్పుడు ఇలా ఉన్నావు అని అడిగితే సుక్కును మీ అత్తను చేయరా అని బ్రతిమలాడతాడు..

శ్రీవల్లికి ఘోర అవమానం..

Advertisement

వేదవతి వాళ్ళ ఇంటికి ఆ వీధిలోని వాళ్ళు వచ్చి మేము పూజ చేసుకున్నాము.. ఇది అమ్మవారి పసుపు కుంకుమ మీ ఇంట్లో పెట్టాలి అని అడుగుతారు.. అయితే మీ పెద్ద కోడలు ఇక్కడే ఉంది కదా అమ్మాయిలారా ఈ పసుపు కుంకుమని తీసుకొని అనగానే వేదవతి ఆగండి అని అంటుంది.. నర్మదను పిలిచి ఈ పసుపు కుంకుమ ని తీసుకో నర్మదా అని అంటుంది.. అదేంటత్తయ్య వల్లి అక్కని తీసుకొని ఇవ్వండి అని నర్మద ఎంత చెప్తున్నా సరే వినకుండా వేదవతి చెప్పింది చెయ్యి ముందు అని అంటుంది.. ఇదే కదూ తన కోడలైన ప్రేమ నర్మదలకు మాత్రమే బొట్టు పెడుతుంది. అక్కడే ఉన్న శ్రీవల్లికి మాత్రం అస్సలు బొట్టు పెట్టదు.. వాళ్లందరూ ఏమైంది వదిన అని అడుగుతున్నా సరే వేదవతి మాత్రం ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

శ్రీవల్లికి షాక్..

శ్రీవల్లి తనకు చాలా బాధగా ఉంది అని వేదవతి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటుంది. వేదవతి వెనకాల వెళ్లిన శ్రీవల్లి అత్తయ్య గారు మీరు ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను.. అప్పుడు కన్నతల్లి లాగ నన్ను చూస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అని ఎంతగా శ్రీవల్లి మాట్లాడాలని ప్రయత్నించిన సరే వేదవతి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఎదురుగా తన కోడళ్ళు తడిచిపోతున్నారని గొడుగు తీసుకుని వెళ్లిన వేదవతిని చూసి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కొత్త ఇంట్లోకి వచ్చేసిన అవని కుటుంబం.. పల్లవికి మైండ్ బ్లాక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

Big Stories

Advertisement
×