Intinti Ramayanam Today Episode November 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి ఇక్కడికి వచ్చిందంటే అవనిని కలిసిందేమో తెలుసుకోవాలని వెంటనే రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తాడు. చక్రధర్ ని చూసిన పల్లవి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నా భర్త బిజినెస్ చేసి బాగుపడతాడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వను పో నీ సమస్యలు నా దగ్గరికి తీసుకురావద్దు అని అంతగా మాట్లాడావు కదా మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పల్లవి అడుగుతుంది.. అదేంటమ్మా పల్లవి నిన్ను చూడడానికే వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఒకవైపు అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం తన తల్లి ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోదు. ఇక మీనాక్షి రాలేదని కన్ఫామ్ చేసుకున్న చక్రధర్ అక్కడ నుంచి బయలుదేరుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనాక్షి తన కూతురిని కొడుకుని వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఎదురుగా అక్షయ్ తనకి జాబ్ ఇప్పిచ్చినందుకు తన ఫ్రెండ్ తో సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ వస్తాడు. మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఎదురుగా వచ్చిన బండి ఆమెని గుద్దేస్తుంది. అయితే అక్కడ వస్తున్నా అక్షయ్ ఆమెను చూసి అయ్యో ఎవరు ఆక్సిడెంట్ చేశారు రక్తం పోతుంది హాస్పిటల్ కి వెళ్దాం పదండి అని అంటాడు.. మీరెవరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిన అక్షయ్ ఆమెకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి నేను అక్కడ వదిలేస్తాను అని అక్షయ్ అంటాడు.. ఇల్లు ఇక్కడ లేదు బాబు మా అమ్మాయి అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను.. అయితే వాళ్ళ అడ్రస్సు వెళ్లాను కాని అక్కడ ఎవరూ లేరని తెలిసింది.
వాళ్లకి ఫోన్ చేద్దామని అనుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఎక్కడో గాలికి ఎగిరిపోయింది.. అలా వెతుక్కుంటూ వస్తున్నాను రెండు రోజుల నుంచి నేను సిటీ లోనే ఉన్నాను అని మీనాక్షి అంటుంది.. ఇక తర్వాత ఆరాధ్య నేను స్కూల్ కి వెళ్ళను అని అనగానే పార్వతీ ఏమైందమ్మా ఎందుకు వెళ్ళవు అని అడుగుతుంది. అందరూ ఆరాధ్యును ఎందుకు స్కూల్ కు వెళ్ళవమ్మా అని అడుగుతారు.. నేను ఫ్యామిలీ ట్రీ డ్రా చేశాను కదా అందులో అమ్మమ్మ తాతయ్య పేర్లు లేవు మేడం అడిగితే ఏం చెప్పాలి నేను అందుకే ఈరోజు స్కూల్ కి వెళ్ళను అని అవనితో ఆరాధ్య అంటుంది.
అక్కడికి వచ్చిన పల్లవి నువ్వెందుకు భయపడటం అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయారని చెప్పు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి అని అందరూ పల్లవిని అరుస్తారు.. మాటలు మర్యాదగా రానివ్వు ఏం మాట్లాడుతున్నావ్ అసలు అని అవని పల్లవిని తిడుతుంది. అయితే నేను తప్పేమన్నాను. అనాధ అయినప్పుడు అమ్మానాన్న ఉన్నారని చెప్తే ఏంటి లేకపోతే ఏంటి అందుకే చచ్చిపోయారు అని చెప్పు అని పల్లవి అంటుంది. చిన్నపిల్లలకు ఏం చెప్పాలో తెలీదా అని అందరూ పల్లవిని తిడతారు.. నేను ఇప్పుడు ఏమన్నానని అందరూ నన్నే అంటున్నారు అని పల్లవి అంటుంది.
పల్లవిని అందరు తిట్టడంతో లోపలికి వెళ్ళిపోతుంది.. అవని బాధపడుతుంటే పార్వతి బాధపడద్దమ్మా అవని అని అంటుంది. నీకు మంచి గురించి కోరుకున్న వారు అంటే బాధ పడాలి వదిన ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటనే వాళ్ళు అంటే బాధపడడం ఎందుకు అని కమలంటాడు.. మీనాక్షి కోసం ఆలోచిస్తూ ఉంటాడు చక్రధర్.. అంతలోకి ఒక రౌడీ అక్కడికి వచ్చి మీరు ఎవర్నో వెతకమని చెప్పారు కదా ఆమె నాకు కనిపించింది ఎవరితోనో ఆటోలో వెళుతుంటే నేను ఫోటో తీసాను అని ఆ ఫోటో చూపిస్తాడు.. ఒక ఆవిడ గురించి వెతకమని ఈయన ఎందుకు చెప్పాడు అని రాజేశ్వరి వచ్చి అడుగుతుంది. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అందుకే నేను వెతకమని చెప్పాను అని అనగానే రాజేశ్వరి మాత్రం అస్సలు నమ్మదు.
Also Read : మీనా వంటకు ప్రశంసలు.. రోహిణి మాటతో ప్రభావతి షాక్.. సుశీల కోసం బాలు గిఫ్ట్..
ఇక మీనాక్షిని అక్షయ్ ఇంటికి తీసుకొని వస్తాడు.. నాకు ఒక యాక్సిడెంట్ అయింది అయితే ఒక ఆవిడ నన్ను ఒక్కడే ఉండి కాపాడింది.. అప్పుడు నేను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాను అని అక్షయ్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…