Shahrukh Khan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, బాద్ షాగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ (Shahrukh Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతూ మరింత పాపులారిటీ అందుకున్నారు. ఇటు సినిమాలతోనే కాదు అటు 7,300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టుకొని ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో చేరి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా షారుక్ ఖాన్ పుట్టినరోజు నిన్న చాలా ఘనంగా జరిగింది. అయితే అంతా బాగానే ఉన్నా షారుక్ ఖాన్ ను కలవడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎక్కడి నుంచో ముంబైకి తరలివచ్చారు.. ఆ సమయంలో వారితో షారుక్ ఖాన్ సిబ్బంది ప్రవర్తించిన తీరుకు షారుక్ ఖాన్ మండిపడ్డారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ తన 60వ పుట్టినరోజును మన్నత్ బాల్కనీలో కాకుండా ముంబైలోని బాంద్రాలో అభిమానుల కోసం ఏర్పాటు చేసిన క్లోజ్డ్ ఈవెంట్లో జరుపుకున్నారు. ఇక్కడ అభిమానులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి, గ్రూప్ సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు షారుక్ దగ్గరికి రావడానికి ప్రయత్నించడంతో.. వారిని షారుక్ సిబ్బంది నెట్టి వేశారు. దీంతో సిబ్బంది అభిమానులతో ప్రవర్తించిన తీరుకు మండిపడ్డారు షారుక్ ఖాన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు షారుక్ ఖాన్ తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. విషయంలోకి వెళ్తే..నిన్న షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా వేలాదిమంది అభిమానులు ఆయనను చూడడానికి ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో జన సమూహ నియంత్రణ కారణంగా అభిమానులతో ఏర్పాటు చేయాల్సిన సమావేశం రద్దయింది. దీంతో ఎక్స్ వేదికగా స్పందించారు. మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు. కానీ ఇది మీ అందరి భద్రత కోసం తీసుకున్న నిర్ణయం అంటూ షారుక్ ఖాన్ తెలిపారు. జన సమూహాన్ని కంట్రోల్ చేయలేక అభిమానులతో మీటింగ్ ను క్యాన్సిల్ చేయించినట్లు సమాచారం.
also read:Mass Jathara: మాస్ జాతర 2 డేస్ కలెక్షన్స్.. అసలు ఏంటీ దారుణం?
మరోవైపు పుట్టినరోజు నాడే షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా ద్వారానే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇకపోతే నిన్న షారుక్ పుట్టినరోజు కావడంతో సినిమా నుంచి షారుక్ లుక్ రివీల్ చేస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో కొన్ని షాట్స్ ఇటీవల హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 1 సినిమాలోవి అని.. బాగా కాపీ చేసేసాడు అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో బ్రాడ్ పిట్ స్టైలిష్ లుక్ ను షారుక్ ఖాన్ తో రీ క్రియేట్ చేయించారు అని సిద్ధార్థ్ పై , ఇటు హీరో పై కూడా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ పుట్టినరోజు నాడు అన్ని సమస్యగానే మారాయని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.