trinayani serial today Episode: మా అమ్మ వస్తే నయనితో మాట్లాడకుండా ఎలా ఉంటుంది. నయని అమ్మను చూడకుండా ఎలా ఉంటుంది అని విశాల్ అడగ్గానే తిలొత్తమ్మ నేనే అబద్దం చెప్పాను అంటున్నావా..? రేపు ఇంకో మాట అంటావు నా క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడతాడు అంటూ తిలొత్తమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అన్నయ్యా నువ్వైనా చెప్పొచ్చు కదా..? అని విశాల్ చెప్పగానే ఆడవాళ్ల విషయాల్లో నేను అంతగా జోక్యం చేసుకోను అంటూ వెళ్లిపోతాడు.
అసలు పాపకు ఏం అయింది. పాలు తాగగానే ఎందుకు అలా అయిపోయింది. కాఫీ తాగిన బాబాయ్ గారు బాగానే ఉన్నారు. పాపకు ఏమైనట్టు.. అసలు అందరూ నన్ను ఎందుకు త్రినయని అంటున్నారు. నాకెందుకు నా పేరు ఊరి పేరు తప్పా ఏమీ గుర్తుకు రావడం లేదని నేత్రి అనుమానంగా తనలో తానే మాట్లాడుకుంటుంది. ఏదేమైనా పసిపిల్ల గాయత్రికి ఏమీ కాకూడదు.. ఎవరైనా ఆ పిల్లను ఏదైనా చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారా.. అని అనుకుంటుండగానే వెనక నుంచి తిలొత్తమ్మ వస్తుంది. నేత్రి షాక్ అవుతుంది.
సుమన, విక్రాంత్ ను లోపలికి తీసుకెళ్తుంది. ఏమైందని విక్రాంత్ అడగ్గానే వచ్చింది మా అక్కనే అయితే పాపను అలా ఎందుకు చేస్తుంది అంటూ ప్రశ్నిస్తుంది. అసలు నయని వదిన గురించి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అని విక్రాంత్ అడగ్గానే.. అచ్చం మా అక్కలాగే ఉండి ఈ ఇంటిలో పాగా వేయాలని చూస్తుందండి. అది తెలియని బావగారు గుడ్డిగా నమ్మేస్తున్నారు అంటూ సుమన చెప్పగానే వచ్చినా తాను ఏమీ అడగడం లేదు కదా..? అంటాడు విక్రాంత్.
ఆస్థిలో వాటా కావాలని నేరుగా అడుగుతారా..? మొదట మగాణ్ని బుట్టలో వేసుకుని తర్వాత ఆస్థిలో సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు అని సుమన చెప్తుంది. ఆడపిల్ల అలా చేస్తుందా..? అని విక్రాంత్ అడగ్గానే మీకు నేను తప్పా అందరూ ఆడపిల్లలాగే కనిపిస్తారు అంటుంది సుమన. తన మీద కోపం కన్నా జాలే ఎక్కువగా వేస్తుంది. వదిన కాకపోయినా.. తన మీద ఎందుకు ఇంత భారం వేసుకుంటుంది అని మనసులో అనుకుంటాడు విక్రాంత్.
తిలొత్తమ్మ కోపంగా నేత్రిని లాక్కుని వస్తుంది. అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు. పాప ఇంకా నిద్ర లేవలేదు. పాలలో ఏమి కలిపి ఇచ్చిందో అని తిలొత్తమ్మ చెప్తుంది. మోసం చేయడానికి వచ్చింది కాక నన్నే అంటావా..? నువ్వు అంటూ తిలొత్తమ్మ నేత్రిని బయటకు గెంటి వేస్తుంది. ఇంతలో గాయత్రి దేవి వచ్చి నేత్రిని పట్టుకుంటుంది. ఇంతలో నేత్రికి నయని అనే జ్ఞాపకం వస్తుంది. వెంటనే గాయత్రి దేవిని చూసి అమ్మగారు అని పిలుస్తుంది. గాయత్రి దేవి కూడా నయని అంటూ సంతోషపడుతుంది. అందరూ షాక్ అవుతారు. పావణమూర్తి మాత్రం అల్లుడు గాయత్రి అక్క మళ్లీ వచ్చినట్టు ఉంది. నయని అమ్మ చూసింది మాట్లాడుతుంది అంటాడు. విశాల్ దగ్గరకు వచ్చి నయని అమ్మను చూశావా..? అని అడుగుతాడు.
పెద్ద అమ్మగారు ఇక్కడే ఉన్నారు బాబుగారు అని చెప్తుంది నయని. తిలొత్తమ్మ, నేత్రిని తిడుతూ నోర్మూయ్ ఇక్కడ ఎవరూ లేరు అంటుంది. గాయత్రి దేవి కోపంగా తిడుతుంది. నయని కూడా అమ్మగారు ఇక్కడే ఉన్నారు లేరని ఎందుకు అబద్దం చెప్తున్నారు అంటూ నిలదీస్తుంది. నయని అమ్మను అడుగుతున్నావు కదా..? ఏమంటుంది అని విశాల్ అడుగుతాడు. అసలు అక్కడ ఎవరూ లేరు కదా బావగారు అంటూ సుమన వస్తుంది. దీంతో అవునని నయని కూడా ఇక్కడ ఎవరూ లేరని అంటుంది. అయిదు నిమిషాల్లో నేను నయని అని మిమ్మల్ని పెంచిన అమ్మే చెప్తుంది అంటూ పక్కకు వెళ్లి కర్ర తీసుకొచ్చి గాయత్రి దేవికి ఇచ్చి తిలొత్తమ్మను కొట్టమంటుంది.
గాయత్రి దేవి కర్ర తీసుకోగానే.. అందరూ షాక్ అవుతారు. అల్లుడూ కర్ర గాలిలో లేసింది అల్లుడూ అంటాడు పావణమూర్తి. గాయత్రి దేవి కోపంగా తిలొత్తమ్మన తిడుతూ.. నేను రాలేదు కదే రానేలేదు కదే అంటూ కర్రతో కొడుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. దెబ్బలకు తట్టుకోలేని తిలొత్తమ్మ నన్ను కొట్టోద్దు అక్కా దెబ్బలకు తాళలేను అంటూ నయని నువ్వైనా చెప్పు అక్కను కొట్టొద్దని చెప్పు అంటూ బతిమాలుతుంది. దీంతో గాయత్రి దేవి కొట్టడం ఆపేస్తుంది. ఇంకొక్కసారి అబద్దాలు ఆడావంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఇప్పుడు అందరికీ నిజం చెప్పు అంటుంది. దీంతో తిలొత్తమ్మ నాన్నా విశాల్ మీ అమ్మ ఎప్పుడో వచ్చింది అని చెప్తుంది. ముందు నేనెవరో చెప్పండి అత్తయ్య అని నయని అనగానే నువ్వు నయనివే.. నా నడిపి కోడలివి అంటుంది. ఇప్పుడు చెప్పు నేనెందుకు కొట్టానో అని గాయత్రి దేవి అడుగుతుంది. ఆ విషయం చెప్తే వీళ్లందరూ నన్ను కొడతారు. అంటుంది. నిజం చెప్తావా..? లేదా..? అంటూ గాయత్రి దేవి వార్నింగ్ ఇవ్వడంతో తిలొత్తమ్మ నిజం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. తిలొత్తమ్మను అందరూ తిడతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?