Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్ ఇంటికి సెక్యూరిటీ వాళ్లు వస్తారు. అందరూ పొజిషన్ తీసుకుంటారు. మీ పిల్లలను మీకు కావాల్సిన వాళ్లను ఇక్కడికే పిలిపించండి సార్ అని చెప్తారు. సరే అంటాడు అమర్. ఇంతలో మనోహరి ఇంత మంది సెక్యూరిటీ గా వచ్చారంటే థ్రెట్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అంటుంది. ఇంతలో మా గురించి ఆలోచించకండి మేము బాగానే ఉన్నాము. మీ ఫోకస్ అంతా వాళ్లను పట్టుకోవడం మీద పెట్టండి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన వాళ్లకు శిక్ష పడాలి. ఆ పని మీరు మాత్రమే చేయగలరు అంటుంది మిస్సమ్మ. ఒక్కప్పుడు అమర్ ధైర్యం ఆరు. ఇప్పుడు నువ్వే మిస్సమ్మ అంటుంది నిర్మల.
చెట్టు చాటు నుంచి చూస్తున్న ఆరు, హ్యాపీగా ఫీలవుతారు. ఆ వచ్చే టెర్రరిస్టులు ఈ ముసలివాళ్లను చంపేస్తే బాగుండు. దీన్ని దాంత పోల్చి అమర్ మనసులో ప్రేమ పుట్టేలా చేసేలా ఉన్నారు. అని మనోహరి మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ మీ నాన్నా వాళ్లకు కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మను అని అమర్ చెప్పగానే ఆ స్లమ్ లో ఉన్నవాళ్లు మనకు కావాల్సిన వాళ్లు అని అస్సలు నమ్మరు. ఇలాంటప్పుడు అలాంటి వాళ్లను ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు..? అంటుంది మనోహరి. కోపంగా అమర్ అలాంటి వాళ్లు అంటే ఎలాంటి వాళ్లు మనోహరి.. వాళ్లు నా వాళ్లు.. ఆయన నా మామయ్య, ఆవిడ ఆయన భార్య. వాళ్లు ఎక్కడున్నా ఎలా ఉన్నా..? నా వాళ్లే అంటాడు అమర్.
మనోహరి నువ్వు తప్పుగా అనుకున్నావు అమర్ అంటుంది. ఎలా అనుకున్నా ఇంకోసారి వాళ్లను తక్కువ చేసి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు అమర్. ఆరు పరుగెత్తుకుంటూ గుప్త దగ్గరకు వచ్చి జరిగేది చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నాకోసం ఒక్కసారి మాయా పేటికను తెరవండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో గుప్త జరిగేది విధి లిఖితం. అది ముందే తెలుసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఇంకోసారి ఆ మాయా పేటిక గురించి నాతో మళ్లీ మాట్లాడొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు.
మిస్సమ్మ, రామ్మూర్తికి ఫోన్ చేసి మీరు, పిన్ని అర్జెంట్ గా ఇంటికి రండి అని చెప్తుంది. దీంతో రామ్మూర్తి ఏంటమ్మా.. ఏమైంది ఏదైనా సమస్యా అని అడుగుతాడు. నాన్నాకు విషయం చెబితే కంగారు పడతారు అని మనసులో అనుకుని ఏం లేదు నాన్నా.. వెంటనే మీరు ఇంటికి రండి అంటుంది. వెంటనే అంటే సాయంత్రం రావొచ్చా అమ్మా అంటూ రామ్మూర్తి అడగ్గానే లేదు నాన్నా వెంటనే రండి అని చెప్తుంది. రామ్మూర్తి సరే అంటాడు. అమ్మాయి వెంటనే రమ్మంటుంది. ఈ ప్రిన్సిపాల్ గారు పర్మిషన్ ఇస్తారో లేదోనని అనుకుంటూ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తాడు.
స్కూల్ లోపలికి వెళ్లిన అరవింద్ మనిషి అంజు కోసం వెతుకుంటాడు. రామ్మూర్తి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి అర్జెంట్ గా పని పడింది. వెంటనే ఇంటికి వెళ్లాలి. రేపు వచ్చి అన్ని పనులు చేస్తాను అని అడుగుతాడు. దీంతో ప్రిన్సిపాల్ తిడుతూ.. ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఇలా అడగొద్దని అంటుంది. ఎంతో అవసరం ఉంటేనే కదా మేడం అడిగేది అంటాడు రామ్మూర్తి. సరే అయితే వెళ్లండి. పర్మినెంట్ గా వెళ్లిపోండి. ఉద్యోగంలోంచి తీసేస్తాను అంటుంది. దీంతో రామ్మూర్తి సరేలే మేడం ఏమీ వద్దు అంటూ గేటు దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రామ్మూర్తి.
అంజలి క్లాస్ రూం దగ్గరకు వెళ్లిన అరవింద్ మనిషి టీచర్ ను అడిగి అంజలిని అమరేంద్ర సార్ తీసుకురమ్మన్నారు అని చెప్పి అంజలిని తీసుకుని వెళ్తాడు. అంజలి కూడా ఆ వ్యక్తితో వెళ్తుంది. నేను డాడీతో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంకుల్ అని అడుగుతుంది. దీంతో అతను నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను అని చెప్తాడు. ఇంతలో అంజు డౌటుగా మా రాక్షసి ప్రిన్సిపాల్ డాడీకి కంప్లైంట్ ఇచ్చేందేమో అందుకే తీసుకురమ్మాన్నారేమో అనుకుని ఆగిపోతుంది.
స్కూల్ దగ్గరకు వచ్చి రాథోడ్, రామ్మూర్తిని చూసి సార్ ఏంటి ఇక్కడ ఉన్నారు అని దగ్గరకు వెళ్లి ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడగ్గానే రామ్మూర్తి కంగారుగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా ఈ టైంలో నువ్వు స్కూల్ కు వచ్చావేంటి..? అని అడుగుతాడు. పిల్లల్ని అర్జెంట్ గా తీసుకెళ్లడానికి వచ్చానని రాథోడ్ చెప్పగానే అవును అమ్మాయి నన్ను కూడా అర్జెంట్ గా ఇంటికి రమ్మని చెప్పింది. ఎందుకు అని అడగ్గానే ఏమీ లేదు సార్ అంటూ లోపలికి వెళ్తాడు. ముగ్గురు పిల్లలను తీసుకుని అంజు క్లాస్ రూం దగ్గరకు వెళ్లగానే టీచర్ ఇప్పుడే ఒకతను వచ్చి తీసుకెళ్లాడని చెప్తుంది. రాథోడ్ అంజు కోసం వెతుకుతుంటాడు. అంజును తీసుకుని వెళ్తున్న వినోద్‌ను చూసిన రామ్మూర్తి వెళ్లి వాణ్ని పట్టుకుంటాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు. అందరూ కలిసి వినోద్ ను కొడుతుంటే పారిపోతాడు.
గుప్త ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. మనసు ఏదో కీడును శంకించుచున్నది ఏదో జరగబోవుచున్నది సమయమునకు ఈ బాలిక కూడా లేదు. ఇదే మంచి సమయము.. మాయా దర్పణమున వీక్షించి ఏం జరగుతుందో తెలుసుకోవలెను అనుకుంటాడు గుప్త. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?