OTT Movie : థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు లవ్ స్టోరీ కలిపితే, ఆ సినిమా మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అలా ఎంటర్టైన్ చేసే ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “గెహ్రయియాన్” (Gehraiyaan) ఈ మూవీ రిలేషన్ లో ఉన్న రెండు జంటల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
అలీషా యోగా టీచర్ గా పని చేస్తూ కరణ్ అనే వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. కరణ్ అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక రైటర్ గా ఉంటాడు. అలీషా కి తల్లి చనిపోవడంతో, తండ్రి సిటీ నుంచి పల్లెటూరికి వెళ్లిపోయి ఉంటాడు. అతడు అలా వెళ్ళిపోయినందుకు అలీషా తండ్రిపై కోపంగా ఉంటుంది. అలీషా కి సియా అనే ఒక కజిన్ ఉంటుంది. సియా జైన్ అనే డబ్బున్న వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంటుంది. ఒకరోజు సియా ఒక పార్టీకి అలీషా జంటను ఇన్వైట్ చేస్తుంది. ఆ పార్టీకి వచ్చిన అలీషా సియా బాయ్ ఫ్రెండ్ కి యోగా ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. మొదట ఇలా జరిగినందుకు అలీషా బాధపడుతుంది. అయితే ఆ తర్వాత జైన్ తో సీక్రెట్ గా లవ్ ఎఫైర్ కొనసాగిస్తుంది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా రిలేషన్షిప్ కొనసాగుతుంది. ఆలీషా కి జైన్ యోగ స్కూల్ ని ఎవరికీ తెలియకుండా బహుమతిగా ఇస్తాడు.
బిజినెస్ బాగా డెవలప్ అయ్యాక అలీషాని పెళ్లి చేసుకుంటానని జైన్ మాటిస్తాడు. అయితే అనుకోకుండా జైన్ బిజినెస్ ఫైనాన్షియల్ గా దెబ్బతింటుంది. ఆ పరిస్థితుల్లో సియాకి ఉన్న ఫామ్ హౌస్ తాకట్టుపెట్టి తన ఫైనాన్షియల్ ప్రాబ్లంని సేవ్ చేసుకుంటాడు. సియా కూడా అతన్ని అనుమానించకుండా హెల్ప్ చేస్తుంది. ఇలా జరుగుతుండగా అలీషా ప్రెగ్నెంట్ అవుతుంది. జైన్ కి ఫోన్ చేసి మన రిలేషన్ షిప్ ని అందరి ముందు అనౌన్స్ చేయాలని ఒత్తిడి చేస్తుంది. ఆలీషాను ఎలాగైనా చంపాలని ఒక షిప్ లోకి పిలిపిస్తాడు జైన్. ఆమెకు మత్తుమందు ఇచ్చి చంపాలనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న అలీషా అక్కడినుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. జైన్ ఆమె బయటికి వెళ్తే ప్రమాదమని నీళ్లల్లో తోయాలని చూస్తాడు. ఆ ఘటనలో జైన్ నీళ్లలో పడి చనిపోతాడు. చివరికి జైన్ చావుకి కారణం అలీషా అని అందరికీ తెలుస్తుందా? అలీషాకి జైన్ తో ఉన్న సంబంధం సియాకి తెలుస్తుందా? పోలీసులు ఈ హత్య కేసును వెలుగులోకి తెస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.