E-Paper
Advertisement

Trinayani Serial Today October 20th: ‘త్రినయని’ సీరియల్‌:  హాసిని వల్లే నయనికి గండం అన్న విశాలాక్షి – నయనిని చంపేందుకు తిలొత్తమ్మ ప్లాన్‌

Trinayani Serial Today October 20th: ‘త్రినయని’ సీరియల్‌:  హాసిని వల్లే నయనికి గండం అన్న విశాలాక్షి – నయనిని చంపేందుకు తిలొత్తమ్మ ప్లాన్‌
Advertisement

 trinayani serial today Episode: నయనికి గండం ఎవరి వల్ల వస్తుందో చెప్పమని విశాలాక్షిని పావణమూర్తి అడుగుతాడు. నువ్వు ఆ విషయం చెబితే నిన్ను గొప్పగా చూసుకుంటామని సుమన అంటుంది. నన్నే చూడొద్దులే కానీ ఏ విధంగా వస్తుందో అది విధిరాతలో ఉంటుందని చెప్తుంది విశాలాక్షి. కానీ ఎవరి వల్ల వస్తుందో తెలుస్తుందని చెప్తుంది. దీంతో ఎవరో చెప్పు వాళ్ల ముక్కు పిండి కొడతాను అంటుంది హాసిని.

ఇంతలో వల్లభ టెన్షన్‌ పడతాడు. తన పేరో.. తిలొత్తమ్మ పేరో చెబుతుందని మనసులో అనుకుంటాడు. ఇంతలో విశాలాక్షి తన చేతిలో ఉన్న బుక్‌ చూపిస్తూ ఆ దేవిని తలుచుకుని ఈ బుక్‌ ఓపెన్ చేస్తే అందులో ఎవరి వల్ల గండం వస్తుందో వాళ్లు కనిపిస్తారని చెప్తుంది. దీంతో హాసిని అక్కా నువ్వేతే ధైర్యంగా చూస్తాను వెళ్లి చూడు అని సుమన చెప్తుంది. సరే అని హాసిని వెళ్లి బుక్‌ తెరచి చూస్తుంది. ఇందులో ఎవరి పేరు కనిపిస్తలేదు అని చెప్తుంది. కళ్లు మూసుకుని అమ్మవారిని స్మరించి కళ్లు తెరచి చూడు పెద్దమ్మా కనిపిస్తుంది అని విశాలాక్షి చెప్పగానే అలాగే అని హాసిని కళ్లు మూసుకుని అమ్మవారిని స్మరిస్తుంది.

Advertisement

తిలొత్తమ్మ మాత్రం ఇది కనక నా పేరు చెబితే అందరూ నన్ను చంపేస్తారేమో అని మనసులో అనుకుంటుంది. హాసిని కళ్లు తెరచి బుక్‌ చూసి షాక్‌ అవుతుంది. నా ప్రాణం తీయాలనుకున్నవాళ్లు ఎవరక్కా అని నయని అడుగుతుంది. ఇంతలో హాసిని గట్టిగా అరుస్తూ బుక్‌ ను పారేస్తుంది. వల్లభ భయంతో ఏం పేరు వచ్చిందో ఏమో మమ్మీ అంటూ తిలొత్తమ్మను గట్టిగా హగ్‌ చేసుకుంటాడు. వదిన ఏమైందని విశాల్‌ అడుగుతాడు. హాసిని షాకింగ్‌ గా అలాగే చూస్తుంది. నయని అమ్మకు గండం రావడానికి ఎవరో చూశావుగా పెద్దమ్మా ఆ పేరు ఎవరిదో చెప్పు అంటుంది విశాలాక్షి.

నేను చెప్పను నీకు నీ పుస్తకానికి ఒక దండం నువ్వేదో అప్పుడప్పుడు మమ్మల్ని సాంత్వన పరుస్తావనుకున్నాను కానీ ఇలా ఫిటింగ్‌ పెడతావనుకోలేదు అంటుంది హాసిని.  టెన్షన్‌ గా వల్లభ ఎవరి పేరు వచ్చిందో చెప్పవే అంటాడు. దీంతో చెప్తే మీరందరూ తట్టుకోలేరు అని హాసిని అంటుంది. ఇంతలో నయని బుక్‌ తీసుకుని ఎవరి పేరు వచ్చిందని చూస్తుంది. ఇందులో ఎవరి పేరు లేదు. పుస్తకం ఇంతకముందు లాగే ఉంది అంటుంది నయని.

Advertisement

ఎవరి పేరు వచ్చిందో నువ్వే చెప్పు అంటూ విశాలాక్షిని సుమన అడగ్గానే నేను చూడలేదు కదా చూసింది పెద్దమ్మ అంటుంది విశాలాక్షి. ఇంతలో విశాల్‌.. వదిన ఆ పేరు ఎవరిదో చెప్పు అంటూ హాసిని దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటాడు. దీంతో హాసిని ఏడుస్తూ చెల్లి నయనికి ప్రాణగండం నావల్లేనని నా పేరు వచ్చింది అంటూ ఏడుస్తుంది హాసిని. దీంతో అందరూ షాక్‌ అవుతారు. నయని వచ్చి హాసినిని బాధపడకు ఇప్పుడు నాకు సంతోషంగా ఉందని నువ్వైతే నాకు నొప్పి బాధ లేకుండా చంపేస్తావు అంటుంది. నువ్వు అలా అంటే నీకంటే ముందు నేనే చనిపోతానని చెప్పి హాసిని వెళ్లిపోతుంది.

తర్వాత సుమన దేవుడి దగ్గర నిలబడి దేవుడా రక్షించావు తల్లి అంటూ మొక్కుతుంది. విక్రాంత్‌ వచ్చి ఏంటి ఇక్కడ ఉండి మొక్కుతున్నావు. ఆ పుస్తకంలో నా పేరు ఎక్కడ వస్తుందోనని తెగ టెన్షన్‌ పడ్డాను. మీరిప్పుడేమో తాపీగా ఆడుగుతున్నారా? కొంచమైతే గుండె కూడా ఆగిపోయేది తెలుసా? అంటుంది సుమన. ఒకవేళ నీ పేరు కనక వచ్చి ఉంటే అని విక్రాంత్‌ అడగ్గానే ఇంకేముంది. మీరంతా నా మీద విరుచుకుపడేవారు కదా? హాసిని అక్కా పేరు వచ్చింది కాబట్టి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అదే నా పేరు వచ్చి ఉంటే.. నా పేరు ముందు వెంటనే కీర్తిశేషురాలు అని వేసేవారు అంటుంది సుమన.

దీంతో విక్రాంత్‌ బాధగా హాసిని వదిన పేరు రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు. విధి రాతను ఎవ్వరూ మార్చలేరు అంటూ సుమన చెప్తుంది. దీంతో విక్రాంత్‌ అసలు విశాలాక్షి దగ్గర ఉన్న బుక్‌ ఏంటో నాకు అర్థం కావడం లేదని అంటాడు. దీంతో భవిష్యవాణి అయ్యుండొచ్చు అంటుంది సుమన. అయితే వెళ్లి  ఆ పుస్తకంలో నీ పేరు ఉందో లేదో చూసుకో అంటాడు. అయితే అందులో నీ పేరు వచ్చి ఉంటే అని సుమన అడగ్గానే.. నా పేరు వచ్చి ఉంటే రేపే విదేశాలకు వెళ్లి ఉండేవాణ్ని. ఆ ఊహ కూడా ఈ దేశం మట్టిలోనే కూరుకుపోవాలి అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

గార్డెన్‌ లో కూర్చుని హాసిని ఏడుస్తుంది. గాయత్రి పాప వచ్చి కన్నీళ్లు తుడుస్తుంది. ఇంతలో నయని, విశాల్‌ వచ్చి ఏమైందని అడుగుతారు. నువ్వేమి తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి చెల్లి అంటూ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదని విశాల్ చెప్తాడు. ఆ బుక్‌లో నీపేరుకు బదులు వేరే పేరు ఉందేమోనని నయని అంటుంది. లేదు అందులో ఉన్నది నా పేరే అంటూ అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది హాసిని.

వల్లభతో పాయిజన్‌ తెప్పిస్తుంది. ఇది ఏంటో తెలుసా? అని అడుగుతుంది తిలొత్తమ్మ. ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది పాయిజన్‌ అని చెప్పగానే అయ్యో మమ్మీ ముందే చెప్పొచ్చు కదా? ఇది ఏంటో టేస్ట్‌ చూద్దామనుకున్నాను కానీ నువ్వు అర్జెంట్‌ గా తీసుకురా అన్నందుకు టేస్ట్‌ చూడలేదు అంటాడు. నువ్వు టేస్ట్‌ చూసుంటే లేట్‌ వల్లభ అయ్యుండేవాడివి అంటూ.. ఇది వాడాల్సింది నయని కోసం. మనం ఈ పాయిజన్‌ ఇచ్చి నయని చనిపోయేలా చేయాలి. అది హాసిని వల్లే జరిగిందని నాటకం ఆడాలి. అప్పుడు అందరూ హాసిని మీద పడతారు. నేరం హాసినిది.. నెపం విశాలాక్షిది అని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో వల్లభ ఆ పాయిజన్‌ కన్నా నీ బుర్ర డేంజర్‌ మమ్మీ అంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×