BigTV English
Advertisement

Spirit Movie : ప్రభాస్ ‘స్పిరిట్ ‘ మూవీ షూటింగ్ షురూ .. ఫ్యాన్స్ బీ రెడీ.. !

Spirit Movie : ప్రభాస్ ‘స్పిరిట్ ‘ మూవీ షూటింగ్ షురూ .. ఫ్యాన్స్ బీ రెడీ.. !

Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఎవరికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజను సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఈ ఏడాది కల్కి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా 1200 కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌‌లో ప్రభాస్ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ చేయబోతున్న సినిమాల జాబితాలో ‘స్పిరిట్‌’ కూడా ఉంది. తాజాగా స్పిరిట్ షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.


ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన అర్జున్ రెడ్డి, యానిమల్‌ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ప్రభాస్ తో ఈయన చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు ఇందులో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారు ? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే టాపిక్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆసక్తిని నెలకొల్పింది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది . ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నారని సమాచారం. అంతేకాదు ఈ మూవీని అబ్రాడ్ లో షూట్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా .. ఈ నటించే నటీనటుల ఎంపిక విషయమై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం స్పిరిట్ గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా స్పిరిట్‌ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌ ను నటింపజేసేందుకు దర్శకుడు సందీప్‌ వంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఏదైనా ముఖ్య పాత్రలో ఆమె ఉంటుందా అంటూ చర్చలు సైతం ప్రారంభం అయ్యాయి. మొత్తానికి స్పిరిట్‌ మూవీలో కరీనా కపూర్‌ నటించబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. షారుఖ్ ఖాన్‌ తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో నటించిన కరీనా కపూర్‌ నటించడం వల్ల స్పిరిట్ స్థాయి పెరగడం ఖాయం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వార్త నిజమైతే బాగుండునని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా ఫుల్ డీటెయిల్స్ వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×