E-Paper
Advertisement

Rashmi Gautam: ఇండస్ట్రీకి రాకముందు అలాంటి వ్యాపారం.. తొలి సంపాదనపై రష్మీ కన్నీళ్లు!

Rashmi Gautam: ఇండస్ట్రీకి రాకముందు అలాంటి వ్యాపారం.. తొలి సంపాదనపై రష్మీ కన్నీళ్లు!
Advertisement

Rashmi Gautam: చదువు పూర్తిచేసుకుని కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. మరి కొంతమంది చదువును మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తమకంటే ఒక సంపాదన అనేది చాలా ముఖ్యం. అందుకే ఇండస్ట్రీలోకి రాకముందే పలువురు సెలబ్రిటీలు పలానా పనిచేసే ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పుకొచ్చిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇక అలాంటివారిలో తానేమి అతీతం కాదు అని చెబుతోంది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). తాను కూడా ఇండస్ట్రీలోకి రాకముందు అలాంటి వ్యాపారం చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలోకి రాకముందు అలాంటి వ్యాపారం చేశాను..

మార్చి 15 ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో రష్మీ గౌతమ్ తన మొదటి సంపాదన గురించి చెప్పుకొచ్చింది. రష్మీ గౌతమ్ షోలో ఉండే కంటెస్టెంట్ ల గురించి అడుగుతూ వారి ఫస్ట్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ అడుగుతూనే.. తన గురించి ఆమె తెలిపింది. రష్మీ గౌతమ్ మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీ లోకి రాకముందు క్యాండిల్స్ చేసి అమ్మేదాన్ని. అలా అమ్మడం వల్ల నాకు వచ్చిన మొదటి సంపాదన 1200 మాత్రమే” అంటూ తన మొదటి సంపాదన.. ఇండస్ట్రీలోకి రాకముందు తాను ఏం చేశాను అన్న విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే తాను కూడా క్యాండిల్స్ బిజినెస్ చేశానని చెప్పడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంత కష్టపడి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చింది కాబట్టి.. కష్టం ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

రష్మీ గౌతమ్ సినిమా కెరియర్..

Advertisement

రష్మీ గౌతమ్ విషయానికి వస్తే.. 2002లో ‘సవ్వడి’ అనే సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన ‘హోలీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘యువ’ అనే సీరియల్ లో నటించిన ఈమె 2017లో వచ్చిన తెలుగు చిత్రం ‘ప్రస్థానం’ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత ఒక రియాలిటీ డాన్స్ షోలో రష్మీ డాన్స్ చూసిన నటి సంగీత ‘కందెన్’ అనే సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా ఆ చిత్రంలో నర్మదా అనే ప్రధాన పాత్ర పోషించిన రష్మీ.. ఇందులో శృంగార పాత్రలో నటించి తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది.

ALSO READ:Deepika Rangaraju: రూ.20తోనే నా జీవితం మొదలు.. నవ్వించే దీపికలో ఇంత దుఃఖమా?

అందుకే బుల్లితెరకే పరిమితం..

Advertisement

ఇకపోతే చాలా చిత్రాలలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ పలు చిత్రాలు చేసింది కానీ ఏవీ కూడా ఈమెకు మంచి గుర్తింపును అందించలేదు. దాంతో బుల్లితెరకే పరిమితమైంది. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×