E-Paper
Advertisement

టీవీ యూజర్లకు యూట్యూబ్ బిగ్ షాక్.. ఆడియన్స్ ఒప్పుకుంటారా?

టీవీ యూజర్లకు యూట్యూబ్ బిగ్ షాక్.. ఆడియన్స్ ఒప్పుకుంటారా?
Advertisement

YouTube:సాధారణంగా మనం ఒక వీడియో చూసేటప్పుడు కానీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో వచ్చే యాడ్స్ కానీ సుదీర్ఘంగా స్కిప్ చేయకుండా చూడాలి అంటే ఎంత చిరాకు వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిరాకును మరింత తెప్పించడానికి అటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కచ్చితంగా తాము సినిమా మధ్యలో వేసే యాడ్స్ చూడాల్సిందే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆడ్ వీడియోలను ప్లే చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తామేమి అతీతం కాదు అంటూ యూట్యూబ్ కూడా రంగంలోకి దిగింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్ .. ఇకపై టీవీలో వీడియోలు చూసేవారికి త్వరలోనే పెద్ద షాక్ ఇవ్వబోతోంది. వాస్తవానికి వీడియో మధ్యలో వచ్చే ప్రకటనలను కొద్ది సెకండ్ల తర్వాత స్కిప్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇకపై టీవీ వినియోగదారుల కోసం ఏకంగా 90 సెకండ్ల పాటు “అన్ స్కిప్పబుల్ యాడ్స్” ను ప్రవేశపెట్టేందుకు యూట్యూబ్ రంగం సిద్ధం చేసుకుంటోంది.

టీవీ యూజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్!

అంటే సుమారుగా ఒకటిన్నర నిమిషం పాటు ప్రకటన పూర్తయ్యే వరకు వినియోగదారులు ఆ వీడియో కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ విధానాన్ని యూట్యూబ్ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. స్మార్ట్ టీవీలలో వీడియో కంటెంట్ వినియోగం భారీగా పెరగడంతోనే ఈ అవకాశాన్ని ఆదాయంగా మార్చుకోవాలని యూట్యూబ్ సంస్థ భావిస్తోంది. ఏది ఏమైనా యూట్యూబ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం టీవీ యూజర్లకు భారీ షాక్ కలిగిస్తోంది అనడంలో సందేహం లేదు.

యూట్యూబ్ కఠిన నిర్ణయం వెనుక కారణం?

Advertisement

ఇకపోతే యూ ట్యూబ్ సడన్గా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే.. ప్రకటన ద్వారా వచ్చే ఆదాయాన్ని గరిష్ట స్థాయికి పెంచుకోవడం, అలాగే ప్రకటనల చికాకు భరించలేని వినియోగదారులు యూట్యూబ్ “ప్రీమియం సబ్స్క్రిప్షన్ ” తీసుకునేలా ప్రోత్సహించడం. ఈ రెండు మార్గాల ద్వారా యూట్యూబ్ కి ఆదాయం గరిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే “ప్రీమియం సభ్యత్వం” పొందితే యాడ్ ప్రకటన లేకుండా వీడియోలు చూసే వీలుంటుంది. అందుకే సబ్స్క్రిప్షన్ల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందాలని సంస్థ ఊహా రచన చేస్తోంది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా జియో సినిమా, హాట్ స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ కూడా తక్కువ ధర ప్లాన్లలో ఇలాంటి సుదీర్ఘ ప్రకటనలను చూపిస్తూ భారీ ఆదాయాన్ని పెంచుకునే ఫార్ములాను అనుసరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ALSO READ:వదినపై 2 కోట్లు పరువు నష్టం దావా వేసిన హన్సిక.. అసలు ఏమైందంటే?

వినియోగదారుడికి చిరాకుతో పాటు నష్టం కూడా..

Advertisement

ఏది ఏమైనా యూట్యూబ్ తీసుకు రాబోతున్న ఈ సరికొత్త నిర్ణయం వినియోగదారుడికి కంటెంట్ వీక్షణలో తీవ్ర అంతరాయం కలిగించడమే కాకుండా స్మార్ట్ టీవీలలో సినిమాలు లేదా సుదీర్ఘమైన వీడియోలు చూసేటప్పుడు 90 సెకండ్ల పాటు ప్రకటనలు చూడడం అనేది అత్యంత విసుగు పుట్టించే అంశం అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా నాణ్యమైన కంటెంట్ను ఉచితంగా అందించడం కంటే ప్రకటనల ద్వారా లేదా నేరుగా యూజర్ ఫీజు ద్వారా లాభాలను అర్జించే లక్ష్యంగా సంస్థలు ముందుకు సాగడం వినియోగదారుడికి భారీ నష్టాన్ని మిగులుస్తోందనటంలో సందేహం లేదు. మరి యూట్యూబ్ ప్రయోగాత్మకంగా చేయనున్న ఈ పరీక్ష ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×