E-Paper
Advertisement

వదినపై 2 కోట్లు పరువు నష్టం దావా వేసిన హన్సిక.. అసలు ఏమైందంటే?

వదినపై 2 కోట్లు పరువు నష్టం దావా వేసిన హన్సిక.. అసలు ఏమైందంటే?
Advertisement

Hansika Motwani:ప్రముఖ సినీనటి హన్సిక (Hansika Motwani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ‘దేశముదురు’ సినిమాతో నటిగా అవతరించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె గత కొంతకాలంగా కుటుంబ వ్యవహారంలో తలమునకలవుతున్న విషయం తెలిసిందే . పెళ్లైన నాలుగేళ్లకే కట్టుకున్న భర్తకు విడాకులు ఇవ్వడం.. ఇప్పుడు భర్త సోదరి ఆరోపణలు తట్టుకోలేక కోర్టు మెట్లు ఎక్కడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోర్ట్ మెట్లెక్కిన హన్సిక కుటుంబం..

ప్రస్తుతం నటి హన్సిక కుటుంబంలో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కోర్టు మెట్లక్కాయి. తనపైన, తన కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తమ పరువుకి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్ పై రూ.2కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే .. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియా వేదికగా తన అత్తగారి కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గృహహింస, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని పలుమార్లు తెలిపింది. దీంతో ఈ ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.

వదినపై రూ.2కోట్లు పరువు నష్టం దావా వేసిన హన్సిక..

Advertisement

అయితే ఆ ఆరోపణలను హన్సిక తాజాగా ఖండించింది. “కేవలం డబ్బు రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే నాన్సీ తమ కుటుంబం పై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుమెట్లు ఎక్కింది. తమ స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకొని.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. ఇకపోతే కుటుంబ పరువు పోతుందనే కారణం తోనే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను కానీ పరిస్థితులు హద్దులు దాటడంతోనే న్యాయపోరాటానికి దిగాల్సి వచ్చింది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాన్సీ పోస్ట్ చేసిన వీడియోలు, చేస్తున్న కామెంట్లు మా తల్లి గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి.. నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతోంది” అంటూ కోర్టులో తన ఆవేదనను వెల్లడించింది హన్సిక. ఇక మా పరువుకు నష్టం కలిగించినందుకు నాన్సీ రూ .2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అంటూ తెలిపింది హన్సిక

స్పందించిన కోర్ట్..

అయితే కేసు విచారించిన కోర్టు నాన్సీ జేమ్స్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది .హన్సిక కుటుంబంపై ఇకనుంచి అవమానకర వ్యాఖ్యలు చేయకూడదని, ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

సోదరికి అండగా ప్రశాంత్ మోత్వానీ..

Advertisement

ఇకపోతే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ కూడా ఈ వివాదంలో తన సోదరి హన్సికకు అండగా నిలిచారు. తన భార్య నాన్సీ జేమ్స్ చేసిన ఆరోపణలలో నిజం లేదని, వివాహం తర్వాత కొంతకాలానికే తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని , అయితే ఇప్పుడు కుటుంబ స్థాయికి చేరుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ:30ఏళ్లు ఎదురుచూసి వెన్నుపోటు పొడిచారు.. కట్టుకున్న భార్యపై తొలిసారి స్పందించిన విజయ్!

కోర్టు తీర్పు ఎటువైపు?

ఇక ఇదే సమయంలో హన్సిక తరఫు న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని వ్యాపార ప్రయోజనాలు లేదా వ్యక్తిగత కక్షల కోణంలో చూస్తున్నారు. నాన్సీ కావాలనే వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారు అంటూ న్యాయవాదులు స్పష్టం చేశారు. మరి న్యాయవాదుల వాదోపవాదాలు విన్న కోర్టు తన తదుపరి తీర్పును వాయిదా వేసింది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో .. హన్సిక కోరిన రూ.2కోట్ల పరిహారం, అలాగే భవిష్యత్తులో నాన్సీ చేసే వ్యాఖ్యలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి అంటే కాలం నిర్ణయించాల్సిందే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×