E-Paper
Advertisement

Amazon Air is ready : అమెజాన్ ఎయిర్ రెడీ.. మీరూ రెడీనా?

Amazon Air is ready  : అమెజాన్ ఎయిర్ రెడీ.. మీరూ రెడీనా?

Amazon Air is ready : దేశంలో ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్… ఇక మరింత వేగంగా వస్తువులను డెలివరీ చేస్తానంటోంది. దీని కోసం ప్రైమ్ ఎయిర్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. అది కూడా హైదరాబాద్ వేదికగా అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సేవలు ప్రారంభం కావడం విశేషం.

ఇప్పటికే సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ పేరుతో చాలా వేగంగా అటు వస్తువులు, ఇటు నిత్యావసరాల్ని సరఫరా చేస్తోంది… అమెజాన్. ఇప్పుడు అంతకంటే వేగంగా వస్తువులు సరఫరా చేసేందుకు… ప్రైమ్ ఎయిర్ సేవలు మొదలుపెట్టింది. దీని కోసం అమెజాన్ కార్గో విమానాలను ఉపయోగించుకోనుంది. ఎయిర్‌ సేవల్లో భాగంగా… బోయింగ్‌ 737-800 విమానాల ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో వస్తువులను త్వరగా డెలివరీ చేయబోతోంది… అమెజాన్. దీని కోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్‌ సంస్థతో అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైమ్ ఎయిర్‌ సేవల ద్వారా సుమారు 11 లక్షల మంది సెల్లర్లకు మేలు జరుగుతుందని అమెజాన్‌ ప్రతినిధిలు తెలిపారు. డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించారు.

భారత్‌లో ఒక ఇ-కామర్స్‌ సంస్థ… థర్డ్‌ పార్టీ విమానసేవలను ఉపయోగించుచుకోవడం ఇదే తొలిసారి. 2016లో అమెరికాలో ప్రైమ్ ఎయిర్ సేవలు ప్రారంభించిన అమెజాన్‌… తర్వాత వాటిని యూకేకు కూడా విస్తరించింది. అమెరికా, యూకే తర్వాత ప్రైమ్ ఎయిర్ సేవలను భారత్‌లోనే అందుబాటులోకి తీసుకురావడం విశేషం. హైదరాబాద్ నుంచే ప్రైమ్ ఎయిర్‌ సేవలు ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ విషయంలో అమెజాన్‌ ప్రేమ కొనసాగుతోందని ఆయన ట్వీట్‌ చేశారు. అతిపెద్ద క్యాంపస్‌తో పాటు, డేటా సెంటర్‌, అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను అమెజాన్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిందని… ఇప్పుడు ప్రైమ్ ఎయిర్‌ సేవలనూ అందుబాటులోకి తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

Follow this link for more updates:- Bigtv

Related News

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

Big Stories

×