BigTV English

Vijay Deverakonda:- రూట్ మార్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Deverakonda:- రూట్ మార్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Deverakonda as co-owner in Prime Volleyball League :- రౌడీ స్టార్ అని అభిమానులు ఎంతో ప్రేమ‌గా పిలుచుకునే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రూట్ మార్చుకున్నారు. సినిమాల‌తో బిజీగా ఈ స్టార్ హీరో ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలోనూ భాగ‌మ‌య్యారు. భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్‌ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ యజమానిగా మారారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌. ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు ’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన విజయ్‌ దేవరకొండ , బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. లీగ్‌ మ్యాచ్‌లకు ఆవల ప్రచారం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా వీక్షకుల ముందుకు విభిన్నంగా ఈ టీమ్‌ను ప్రదర్శించనున్నారు.


రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ పవర్డ్‌ బై ఏ 23 అనేది ప్రైవేట్‌ యాజమాన్య నిర్వహణలోని ఇండియన్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ లీగ్‌. హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, కోల్‌కతా, కాలికట్‌, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఎనిమిది టీమ్‌లు దీనిలో పోటీపడుతున్నాయి. ఈ లీగ్‌ తొలి సీజన్‌ అపూర్వ విజయం సాధించింది. ఇది ఒకే సమయంలో ఇంగ్లీష్‌ , హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌లు మొత్తంమ్మీద 41 మిలియన్‌ టెలివిజన్‌ వ్యూయర్‌ షిప్‌ నమోదు చేయడంతో పాటుగా 43 మిలియన్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్‌షిప్‌ నమోదు చేసింది. అదనంగా, ఈ సీజన్‌ పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వ్యాప్తంగా 5 మిలియన్‌ ఫ్యాన్‌ ఎంగేజ్‌ మెంట్స్‌ను సొంతం చేసుకుంది. దీనితో పాటుగా భారీ ప్రాంతీయ కనెక్షన్స్‌ను సామాజిక మాధ్యమ వేదికలైనటువంటి షేర్‌చాట్‌ , మోజ్‌ ద్వారా పొందింది.

ఈ లీగ్‌ రెండవ సీజన్‌లో 31 మ్యాచ్‌లు 04 ఫిబ్రవరి నుంచి 05 మార్చి వరకూ జరుగనున్నాయి. దీనిని భారతదేశంలో ప్రత్యేకంగా సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ తమ సోనీ స్పోర్ట్స్‌ 1, 3, 4లలో ప్రసారం చేయడంతో పాటుగా సోనీ లివ్‌పై స్ట్రీమింగ్‌ చేయనుంది. అంతర్జాతీయంగా ఈ మ్యాచ్‌లు వాలీబాల్‌ వరల్డ్‌ స్ట్రీమ్‌ చేయనుంది. వాలీబాల్‌ యొక్క గ్లోబల్‌ గవర్నింగ్‌ బాడీ , ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి వాలీబాల్‌ (ఎఫ్‌ఐవీబీ) యొక్క వాణిజ్య విభాగం ఇది. హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ అనేది ప్రొఫెషనల్‌ మెన్స్‌ వాలీబాల్‌ టీమ్‌. హైదరాబాద్‌ కేంద్రంగా ఇది ఉంది. అతి తక్కువ వయసు సగటు కలిగిన ఈ టీమ్‌, ఎడతెగని శక్తి మరియు స్ర్కిప్ట్‌కు ఆవల ఆలోచించడం పట్ల మక్కువ కలిగింది. తమ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కంకణాల యొక్క లక్ష్యంకు అనుగుణంగా ఈ టీమ్‌ , కోర్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం తో పాటుగా కోర్ట్‌ వెలుపల అభిమానులతో అనుసంధానించబడటం ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈ బ్లాక్‌హాక్స్‌ టీమ్‌ తొలి సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అహ్మాదాబాద్‌ డిఫెండర్స్‌ చేతిలో ఓడింది.


విజయ్‌ దేవరకొండ, ఓ యువ భారతీయ సూపర్‌స్టార్‌. తెలుగు సినిమాలలో అసాధారణ ప్రదర్శన తో అశేష అభిమానులను కలిగిన ఆయన ఇప్పుడు జాతీయ స్ధాయిలో కూడా నటిస్తున్నారు. బ్లాక్‌హాక్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సహ యజమానిగానే కాక ఆయన పలు సంస్థలలోనూ పెట్టుబడులు పెట్టి సీరియల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌గానూ నిలిచారు. విజయ్‌ తన సొంత స్ట్రీట్‌వేర్‌ ఫ్యాషన్‌ లైన్‌ రౌడీ, ఓ థియేటర్‌ మల్టీప్లెక్స్‌ ఏవీడీ, రీజనల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అహ సహ యజమాని మరియు మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌ కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిగి ఉన్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×