E-Paper
Advertisement

Compound Interest : చక్రవడ్డీ..సంపన్నుల సంపద మంత్రం..

Compound Interest : చక్రవడ్డీ..సంపన్నుల సంపద మంత్రం..
Advertisement

Compound Interest : ‘కాంపౌండ్ ఇంట్రస్ట్ (చక్రవడ్డీ) అనేది ప్రపంచంలో ఎనిమిదో వింత. దీన్ని అర్థం చేసుకున్నవారు త్వరగా సంపన్నులవుతారు. ఎవరు దీన్ని పట్టించుకోరో.. వారు భవిష్యత్తులో చింతించాల్సి వస్తుంది అన్నారు.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఇది ముమ్మాటికీ నిజమని చరిత్ర కూడా నిరూపించింది.

చక్రవడ్డీ అంటే..?
చక్రవడ్డీ అంటే అసలుపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని తిరిగి అసలులో కలపటం. తద్వారా మరింత ఆదాయాన్ని పొందటం. సింపుల్‌గా చెప్పాలంటే.. వడ్డీపై వడ్డీ. చక్రవడ్డీతో మంచి లాభాన్ని అందుకోవాలంటే.. ఎక్కువకాలం పొదుపు చేయాలి. అందుకే వీలున్నంత చిన్నవయసులోనే పొదుపు మొదలు పెట్టాలి. అందుకే.. మీ అవసరాలకు మించి ఉన్న డబ్బును వెంటనే పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఇలా లెక్కించాలి..!
మీ దగ్గరున్న రూ.10 వేలను రెట్టింపు చేయాలనుకుంటే ముందుగా.. అదెంత టైంలో రెట్టింపు అవుతుందో లెక్కించాలి. దీనికోసం.. 72ను మీకు వచ్చే వడ్డీరేటుతో భాగించండి. ఉదాహరణకు ఏడాదికి 12% వడ్డీరేటుంటే దాన్ని 72తో డివైడ్ చేస్తే (72/12=6).. అంటే ఆరేళ్లలో మీ అసలు.. రెట్టింపవుతుంది. అదే 7.5 శాతం వడ్డీ రేటు ఉంటే.. 9.6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఐదేళ్లలోనే రెట్టింపు చేయాలనుకుంటే అప్పుడు 72ను 5తో భాగించండి. అప్పుడు ఎంత వడ్డీరేటుకి పొదుపు చేయాలో తెలుస్తుంది.

చక్రవడ్డీ కీలకం ఇదే..
మీ సొమ్మును మెరుగైన రీతిలో పెట్టుబడిగా పెడితే తప్ప అది పెరగదు. తక్కువ వయసు నుంచే పొదుపు ప్రారంభిస్తే.. ఎక్కువ మొత్తం చేతి కందుతుంది. అలాగే.. ద్రవ్యోల్బణం పెరిగేతే ఖర్చులూ పెరుగుతాయి. కనుక ఏటా పెట్టుబడినీ పెంచుకుంటూ పోవాలి. ఇప్పడు మీ నెల ఆదాయం.. రూ.30 వేలుంటే నెలకు రూ.3 వేలు పొదుపుచేస్తే.. ఏడాది తర్వాత మీ వేతనం 35 వేలైతే.. రూ.3,500 మదుపు చేయాలి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×