E-Paper
Advertisement

Congress Victory : బీఆర్ఎస్ కార్యకర్తల నోట.. కాంగ్రెస్ విజయ మంత్రం

Congress Victory : బీఆర్ఎస్ కార్యకర్తల నోట.. కాంగ్రెస్ విజయ మంత్రం
Advertisement
Telangana congress news

Telangana congress news(TS politics) : తెలంగాణ ఎన్నికల సమరంలో గెలుపెవరిది..? ఏ పార్టీ ఎన్ని అంచనాలు వేసుకున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నింటికి ఓ కాల్ రికార్డింగ్‌ సమాధానం చెబుతోంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తే సొంత పార్టీ గెలవదని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అది కూడా ఆ పార్టీకి చెందిన కాల్‌ సెంటర్‌ నుంచి వచ్చిన కాల్‌కే దిమ్మితిరిగి బొమ్మ కనిపించేలా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఆడియో ఏంటో మీరూ వినండి.

ఈ ఆడియో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తదిగా తెలుస్తోంది. వర్ధన్నపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు ఓటు వేయాలంటూ కాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని.. కాంగ్రెస్‌ వంద సీట్లు గెలిచే పరిస్థితి ఉందని చెబుతున్నాడు ఆ కార్యకర్త. కాల్ చేసి బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని చెబుతున్న ఆ కాల్ సెంటర్ సిబ్బందికి తాను ఒక్కడినే ఓటు వేస్తే పార్టీ గెలవదంటూ షాక్‌ ఇచ్చాడు ఆ కార్యకర్త. ప్రజల్లో తిరగలేక చస్తున్నామంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

ఒక్కడికి ఇల్లు రాలే, ఒక్కడికీ ఉద్యోగం రాలేదని.. నేతలు కోట్లకు కోట్లు సంపాదించుకున్నారంటూ ఫైర్ అయ్యారు. వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం కడితే తుపుక్కున కూలిపోయిందంటూ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం ప్రభంజనం అంతా హస్తం పార్టీ వైపు తిరుగుతోందని.. ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆ బీఆర్‌ఎస్‌ కార్యకర్త తేల్చేశాడు.

.

Advertisement

.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

Big Stories

Advertisement
×