E-Paper
Advertisement

Cars Offers : కొత్త కార్లపై భారీ రాయితీలు..! ఎంతంటే?

Cars Offers : కొత్త కార్లపై భారీ రాయితీలు..! ఎంతంటే?
Advertisement

Cars Offers : ఈ పండుగల సీజన్‌లో దేశంలో 10 లక్షల కార్లు అమ్ముడవుతాయని వాహన తయారీ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మాంద్యం బెడద లేకుపోవటంతో పలు వాహన కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీలను ప్రకటించాయి. రాయితీ, ఎక్స్ఛేంజ్‌, లాయల్టీ బోనస్‌‌లే కాకుండా, డీలర్లు సైతం తమవంతుగా కార్ల యాక్సెసరీలపై అదనపు ఆఫర్లను ఇస్తున్నారు. అక్టోబర్‌ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్‌ తన ఎక్స్‌టర్‌, వెన్యూ, క్రెటా మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై రూ.43 వేలు, ఆరాపై రూ.33 వేలు, విద్యుత్‌ వాహనం కోనాపై రూ.2 లక్షల వరకు రాయితీ ఉంది.

Advertisement

ఎస్‌యూవీ విభాగంలో కింగ్ అయిన మహీంద్రా.. ఎక్స్‌యూవీ 300పై రూ.90 వేలు, విద్యుత్‌ ఎక్స్‌యూవీ 400పై రూ.1.25 లక్షలు, అధికంగా అమ్ముడయ్యే బొలెరోపై రూ.70 వేలు, బొలెరో నియోపై రూ.50 వేల రాయితీ ఇస్తోంది.కానీ ఎక్స్‌యూవీ 700, స్కార్పియో ఎన్‌, స్కార్పియో క్లాసిక్‌పై ఏ ఆఫరూ లేదు.

టాటా మోటార్స్.. నెక్సాన్‌, సఫారీ, హ్యారియర్‌ మోడళ్లలో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ పండుగ వేళ రూ.1.40 లక్షల వరకు రాయితీలను ప్రకటించింది.

Advertisement

డీలర్ల ఆఫర్లతో కలిపి మారుతీ సుజుకీ ఆల్టో, వేగనార్‌, సెలెరియో, ఎస్‌ ప్రెసో కార్లపై రూ.61 వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. స్విఫ్ట్‌పై రూ.54 వేల విలువైన ఆఫర్లున్నాయి.అయితే ఈ రాయితీలు కొన్ని మోడళ్లకే వర్తిస్తాయి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×