BigTV English

Bishan Singh Bedi : స్పిన్ మాంత్రికుడు.. దిగ్గజ క్రికెటర్ కన్నుమూత..

Bishan Singh Bedi : స్పిన్ మాంత్రికుడు.. దిగ్గజ క్రికెటర్ కన్నుమూత..

Bishan Singh Bedi : భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషణ్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. పంజాబ్ లో ని అమృత్ సర్ లో 1946 సెప్టెంబర్ 25న జన్మించారు. భారత్ జట్టు తరఫున 67 టెస్టులు ఆడిన బేడీ స్పిన్నర్ గా రాణించారు. టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక 7 వికెట్లు తీశారు. టెస్టుల్లో అతని బెస్ట్ బౌలింగ్.. 194/10. 13 సార్లు 4 వికెట్లు, 14 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. టెస్టుల్లో ఒకసారి పది వికెట్లు తీశారు.


టెస్టులో 101 ఇన్నింగ్స్ లు ఆడిన బేడీ 28 సార్లు నాటౌట్ గా నిలిచారు. మొత్తం 656 పరుగులు చేశారు. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ 50 నాటౌట్. కెరీర్ మొత్తం మీద ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశారు. 26 క్యాచ్ లు అందుకున్నారు.

బిషణ్ సింగ్ బేడీ 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీశారు. ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 7 ఇన్నింగ్స్ లు ఆడిన బేడీ రెండుసార్లు నాటౌట్ గా నిలిచారు. వన్డేల్లో మొత్తం 31 పరుగులు మాత్రమే చేశారు. బెస్ట్ స్కోర్ 13 పరుగులు. వన్డేల్లో 4 క్యాచ్ లు అందుకున్నారు.


ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బేడీ రికార్డు అద్భుతంగా ఉంది. మొత్తం 370 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 1560 వికెట్లు తీశారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×