Big Stories

Vistara crisis: విస్తారా-ఎయిర్ ఇండియా విలీనంలో కొత్తచిక్కులు.. ఉద్యోగులకు లే ఆఫ్ తప్పదా ?

Vistara woes cast shadow Over Indian Aviation’s Summer skies: విస్తారా, ఎయిర్ ఇండియా విలీనానికి సిద్ధమవుతుండగా.. ఉద్యోగులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. పైలట్లు వారి జీతం మరియు రోస్టర్‌లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇతర నాన్-ఆపరేటింగ్ సిబ్బంది ఎయిర్ ఇండియాలో సంస్థను విలీనం చేస్తే అందులో వారి వారి స్థానాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనమయ్యేందుకు సిద్ధమవగా.. కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి సమానమైన అవకాశాలను అందిస్తామని హామీ ఇచ్చింది.
గత ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు సంస్థలు ఉద్యోగుల ఎంపిక పరీక్షలను ప్రారంభించాయి. పలువురు ఉద్యోగులను హొగన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. సెప్టెంబరు నుంచి పలు మార్లు జూనియర్‌ ఉద్యోగులకు ఆప్టిట్యూడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు రావాల్సి ఉంది. ఎయిర్ ఇండియా విలీనానికి ముందు కొత్త పే స్ట్రక్చర్ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో సమస్యను అధిగమించేందుకు విస్తారా ఏప్రిల్ 7 నుండి 10% విమానాలను రాకపోకలను తగ్గించింది. విస్తారాలో 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఎయిర్ ఇండియాలో విలీనం కారణంగా సంస్థలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

 

- Advertisement -

Also Read: ఓలా ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 69 వేలకే ఎస్1 స్కూటీ 

- Advertisement -
Vistara
Vistara

పైలట్‌లకు 70 గంటలు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం వారానికి కనీసం 40 గంటల విమాన ప్రయాణ సమయాన్ని నిర్ధారించారు. కొత్త నిబంధనలను మార్చి 15లోపు ఆమోదించాల్సిన ఉండగా.. అందుకు పైలట్‌ లు అంగీకారం తెలపకపోవడంతో విస్తారాకు విమానాలను రద్దు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.

దేశంలోని మూడవ అతిపెద్ద విమానయాన సంస్థ అయిన విస్తారా ఈ నెల ప్రారంభంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో అనేక దేశీయ విమానాలను రద్దు చేసింది. వచ్చే కొన్ని వారాల్లో వేసవిలో విమాన ఛార్జీలను 10-20% పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉంది . 2007లో ఎయిర్ ఇండియా-ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీన సమయంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. పరిమిత సిబ్బందితో తక్కువ వేతనంతో ఎయిర్‌లైన్స్ సంస్థ పనిచేయగా.. విమానాల ఆలస్యంతో పాటు డ్యూటీకి హాజరుకాలేని వారిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News