E-Paper
Advertisement

Chaayos : ఐఐటీలో చదువు.. టీ షాప్స్ తో రూ. 100 కోట్ల బిజినెస్..!

Chaayos : ఐఐటీలో చదువు.. టీ షాప్స్ తో రూ. 100 కోట్ల బిజినెస్..!
Advertisement
Chaayos

Chaayos : చదువులేక పోవటంతో బతకటం కోసం టీకొట్టు పెట్టుకున్న వారిని మీరు చూసే ఉంటారు. కానీ.. టీ అమ్మటం కోసం.. ఐఐటీ డిగ్రీని పక్కనపడేసిన వారి గురించి మీరు వినిఉండకపోవచ్చు. అతడే… నితిన్ సలూజా. ఐఐటీలో బీటెక్ చదివి, లక్షల కొలువును వదులుకుని ‘చాయోస్’ (Chaayos) పేరుతో దేశమంతా టీ షాపులు పెట్టి సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు.

నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. సెలవుల్లో భారత్ వచ్చినప్పడు ఏదో ట్రిప్ కోసం.. భార్యతో కలిసి గురుగ్రామ్ వెళ్లారు. మంచి టీ తాగుదామనుకుని ఎంత వెతికినా.. చెప్పుకోదగ్గ ఒక్క టీ షాప్ కూడా కనిపించలేదు. ఆ ప్రాంతంమంతా సర్వే చేయగా.. అక్కడ బోలెడంత మంది కస్టరమర్లున్నా.. ఆ స్థాయిలో అమ్మేవాళ్లు లేరని నిర్ధారించుకున్నాడు. దీంతో.. మనమే ఆ పనిచేస్తే ఎలా ఉంటుందనుకుని.. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి పోటీదారుల వ్యాపారం గురించి రీసెర్చ్ చేశాడు.

Advertisement

2012లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి స్నేహితుడు రాఘవ్‌తో కలిసి గురుగ్రామ్‌లోనే ‘చాయోస్’ పేరుతో ఒక హైఎండ్ టీ షాపు మొదలుపెట్టారు. వచ్చిన కస్టమర్ అభిరుచిని కనుక్కొని, అప్పటికప్పడు అతడు కోరిన రీతిలో ‘మేరీ వాలీ చాయ్’ పేరుతో టీ ఇవ్వటంతో కొద్దిరోజుల్లోనే మంచి పేరొచ్చింది. తొలిరోజుల్లో ఆశించినమేర కస్టమర్లు రాలేదు. సిబ్బంది సెలవు పెట్టినప్పడు ఆర్డర్ తీసుకోవటం, టీ తయారుచేయటం, సర్వింగ్ వంటి పనులూ తానే చేశారు.

2020 నాటికి రూ.100 కోట్ల వ్యాపారం చేసే స్థాయికి వచ్చింది.ముంబై,బెంగళూరు, చండీగఢ్,పుణేలతో సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో చాయోస్‌కు 200కు పైగా స్టోర్లు ఉన్నాయి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×