BigTV English

National Awards 2023: జాతీయ చలన చిత్ర అవార్డ్ వేదిక పై సత్తా చాటిన తెలుగు చిత్రాలు..

National Awards 2023: జాతీయ చలన చిత్ర అవార్డ్ వేదిక పై సత్తా చాటిన తెలుగు చిత్రాలు..

National Awards 2023: ఢిల్లీలో 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం ఎంతో ఘ‌నంగా జరిగింది. దేశవ్యాప్తంగా పలు భాషలకు సంబంధించిన మూవీస్ ఈ అవార్డుల కోసం గట్టిగానే పోటీపడ్డాయి. పుష్ప చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా అల్లు అర్జున్ కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోవడానికి అల్లు అర్జున్ ఈవెంట్ కి సతీ సమేతంగా హాజరయ్యాడు.


రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా నటీనటులు తమ అవార్డులు అందుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీకి అల్లు అర్జున్ ఉత్త‌మ నటుడు పుర‌స్కారాన్ని అందుకున్నాడు. దాదాపు 7 ద‌శాబ్దాల త‌రువాత ఈ గౌరవం దక్కించుకున్న తెలుగు హీరోగా బన్నీ చ‌రిత్ర సృష్టించాడు.

తనకు జాతీయ అవార్డు రావడం పై అల్లు అర్జున్ తన హర్షం వ్యక్తం చేస్తూ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నాకు జాతీయ పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉంది” అన్న బన్నీ రెడ్ కార్పెట్ పై కిరాక్ రేంజ్ లో త‌న‌దైన స్టైల్లో పుష్ప డైలాగ్ చెప్పాడు. ఈ వీడియో ను మైత్రీ మూవీ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడి అవార్డ్ అందుకుంటున్న మూమెంట్ ను బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ త‌న ఫోన్‌లో బంధించాడు.


ఆది పురుష్ మూవీ లో ప్రభాస్ సరసన జానకిగా నటించిన.. కృతి స‌న‌న్ ,’మిమి’ సినిమాకు గానూ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకున్నారు. తన తో పాటు ‘గంగూబాయి క‌తియావాడీ’ మూవీ కి బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ కూడా ఉత్త‌మ న‌టి అవార్డ్ దక్కించుకుంది. ఈ మూవీ లో ముంబై లోని వేశ్య వాడ అమ్మాయిగా.. ఆలియా నటన అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అత్య‌ధిక అవార్డుల్ని దక్కించుకొని తన సత్తా చాటింది. ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన మూవీ తో పాటు ప‌లు విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఉత్త‌మ యాక్ష‌న్ (కింగ్ సాల‌మ‌న్‌), ఉత్త‌మ కొరియోగ్రఫీ (ప్రేమ్ ర‌క్షిత్, నాటు నాటు), ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం గా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

ఈ మూవీ నుంచి పాటకు ఉత్తమ సంగీత విభాగానికి గాను సంగీత దర్శకుడు కీర‌వాణి, ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌కు గాను శ్రీ‌నివాస మోహ‌న‌న్ అవార్డ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ “నా మొదటి లక్ష్యం నేను తీసే సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం..ఇక ఇలా జాతీయ స్థాయిలో అవార్డు రావ‌డం..అది కూడా 6 అవార్డులు రావ‌డం నిజంగా నాకు బోనస్ లాంటివి. ఇలా అవార్డ్స్ రావడం మూడేళ్ల నా సినిమా శ్రమను, టెక్నీషియ‌న్లు పడ్డ తపన గుర్తించిన‌ట్టే, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×