E-Paper
Advertisement

What’sApp :- వాట్సాప్ కొత్త అప్‌డేట్.. వారికి మాత్రమే..

What’sApp :- వాట్సాప్ కొత్త అప్‌డేట్.. వారికి మాత్రమే..
Advertisement

What’sApp :- వాట్సాప్ సరికొత్త అప్‌డేట్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతానికి అది ఎంపిక చేసిన ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే. ఆపిల్ యాప్ స్టోర్లో ఎంపిక చేసిన ఐఓఎస్ యూజర్లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. పాత మెస్సేజ్‌లను తేదీల వారీగా వెతికేందుకు… కొత్త అప్‌డేట్ సాయపడుతుంది. మెసేజింగ్ యాప్‌లోని ఇతర యాప్‌ల నుంచి ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డ్రాగ్, డ్రాప్ చేయడానికి, చాట్ మెస్సేజ్‌లను ఇతర వాట్సాప్ వినియోగదారులతో భాగస్వామ్యం చేయడానికి… కొత్త అప్‌డేట్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఇప్పటికే ఎంపిక చేసిన ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్… త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకూ అందుబాటులోకి రానుంది.

ఐఫోన్ వాట్సాప్ యూజర్లు గతంలో కీవర్డ్స్ ద్వారా పాత మెస్సేజ్‌ల కోసం సెర్చ్ చేసే వాళ్లు. ఇప్పుడు ఐఓఎస్ కోసం వాట్సాప్ సెర్చ్ బై డేట్ ఫీచర్ ప్రవేశపెట్టడంతో… నేరుగా తేదీ, నెల, సంవత్సరాన్ని సెట్ చేసి, పాత మెస్సేజ్‌లు వెతకొచ్చు. సెర్చ్-బై-డేట్ ఫీచర్ మెసేజింగ్ విండో లోపల స్క్రోలబుల్ మెనూగా కనిపిస్తుంది. అయితే చాట్ హిస్టరీ ప్రారంభమయ్యే తేదీతో స్క్రోలబుల్ మెనూ ముగుస్తుంది. ప్రతి మెసేజింగ్ విండోలో ఇప్పటికే ఉన్న చాట్ హిస్టరీ టైమ్ లైన్ తనిఖీ చేయడానికి, నావిగేట్ చేయడానికి కూడా కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.

Advertisement

అయితే, వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అప్‌డేట్… ప్రస్తుతం కొద్దిమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే… ఆపిల్ యాప్ స్టోర్లో కనిపిస్తోంది. త్వరలోనే ఇది ఐఫోన్ వినియోగదారులందరికీ, ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ను కొందరు వినియోగదారులు పరీక్షించి చూశారని… కొత్త అప్‌డేట్ బాగుందని చెప్పారని, కొన్ని టెక్ సంస్థలు వెల్లడించాయి. ఇది స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తే… చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాయి.

Follow this link for more updates:- Bigtv

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×