Rudraprayag: డిస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశాలకు వెళ్లే బదులు మన దేవభూమిలో హాయిగా వివాహాలు చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఏమోగానీ వివాహాలు చేసుకోవడం మొదలైంది. తాజాగా రుద్రప్రయాగ్‌లో శివపార్వతుల వివాహం జరిగిన చోట ఒక్కటైంది ఓ జంట. మంచును సైతం నూతన దంపతులు లెక్క చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
దేవభూమిలో వివాహాలు జోరు
డిస్టినేషన్ వెడ్డింగ్‌కు విదేశాలకు వెళ్లే బదులు.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని భావించింది మీరట్ కు చెందిన ఓ జంట. అందుకోసం రుద్రప్రయాగ్‌లోని ఓ ఆలయాన్ని వేదికగా ఎంపిక చేసుకుంది. ఏర్పాట్లు చేసుకుని ఇరు కుటుంబాలు ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ కు చేరుకున్నాయి. కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో దట్టమైన హిమపాతం కురుస్తోంది.
ఎటువైపు చూసినా తెల్లటి మంచు పొరలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేసుకోవాలని బంధువులు సూచన చేసినా ఆ జంట ఏ మాత్రం పట్టించుకోలేదు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఆ జంట. వసంత పంచమి రోజు రుద్ర ప్రయాగ్‌లోని త్రియుగినారాయణ్ టెంపుల్ లో ఆ జంట వివాహం జరిగింది.
శివపార్వతుల వివాహం ఆ ప్రాంతంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణంలో వివాహం చేసుకున్న ఆ జంట, తమకు పరమశివుడి ఆశీస్సులు లభించాయని సంతోషం వ్యక్తం చేసింది. ఈ వివాహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నూతన దంపతులు మంచులో నడుస్తూ ఆలయానికి వెళ్లడం కనిపించింది.
భారీ హిమపాతంలో వివాహం.. వీడియో వైరల్
రుద్రప్రయాగ జిల్లాలో త్రియుగినారాయణ ఆలయం ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. చార్ ధామ్ యాత్రలో యాత్రికులకు రుద్రప్రయాగ ఒక ముఖ్యమైన స్టాప్. అలకనంద-మందాకి నదులు కలిసే ఐదు పవిత్ర సంగమాలు ఇది ఒకటి. కేదార్‌నాథ్-బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాలు వేరు చేసే ప్రదేశాన్ని సూచిస్తుంది. త్రియుగినారాయణ ఆలయం కేదార్‌నాథ్ మార్గంలో చార్‌ధామ్‌కు దగ్గరగా ఉంది.
త్రియుగినారాయణ అనేది మూడు పదాల నుండి వచ్చింది. త్రి అంటే మూడు.. యుగి అంటే యుగాలు.. నారాయణ్ అంటే విష్ణువుకు మరో పేరు. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. శివుడు-పార్వతి దేవి వివాహం చేసుకున్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది కూడా.
ALSO READ: 90 నిమిషాల చికిత్సకు రూ. 1.65 లక్షల బిల్లు.. షాక్‌లో బాధితుడు, ఎక్కడో తెలుసా..?
విష్ణువు.. శివుడు-పార్వతుల వివాహ వేడుకను ఏర్పాటు చేయగా, బ్రహ్మ మాత్రం పూజారి పాత్రను పోషించాడు. అందుకే ఆ ప్రాంతాన్ని త్రియుగినారాయణ ఆలయం అని అంటుంటారు. సాంప్రదాయ ఆచారాల ప్రకారం జంటలు వివాహం చేసుకోగల కొన్ని ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ప్రతీ ఏడాది కొత్త జంటలు తమ పెళ్లిళ్లకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు.
ఈ ఆలయం నిర్మాణం కేదార్‌నాథ్ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఆలయం ముందు శివుడు-పార్వతి వివాహం రోజు నుండి మండుతున్నట్లు చెప్పబడే ఒక అగ్ని ఉంటుంది. దాన్ని అఖండ ధుని అని పిలుస్తుంటారు. భక్తులు తరచుగా ఈ అగ్నికి కట్టెలు అర్పించి బూడిదను ఇంటికి తీసుకెళ్తారు. వివాహ జీవితంలో సామరస్యం, ఆనందాన్ని తెస్తాయని భక్తలు ప్రగాఢ విశ్వాసం.
उत्तराखंड में बर्फबारी के बीच सात जोड़े विवाह बंधन में बंधे @NavbharatTimes pic.twitter.com/mTSgrH6YlM
— NBT Uttar Pradesh (@UPNBT) January 24, 2026