E-Paper
Advertisement

Viral Wedding Card: సీఎస్కే పేరుతో పెళ్లి కార్డు.. ఓ పెళ్లి జంట వినూత్న ఐడియా..

Viral Wedding Card: సీఎస్కే పేరుతో పెళ్లి కార్డు.. ఓ పెళ్లి జంట వినూత్న ఐడియా..
Advertisement

Wedding Card: ఈ కాలంలో జరిగే పెళ్లిళ్లు ఓ రేంజ్‌లో చేసుకోవాలి అనే ఆలోచన కంటే చిన్నగా చేసినా సరే ఫేమస్ అవ్వాలి, వైరల్ అవ్వాలని అనే ఆలోచనతోనే చేస్తున్నారు. ఈ తరుణంలో పెళ్లి బట్టలు, పెళ్లి చేసుకునే విధానం, లేక పెళ్లి చేసుకునే స్థలాల్లో ఇలా ఏదో ఒక దానిలో స్పెషాలిటీ ఉండాలని చూసుకుంటున్నారు. లేదా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంట్రీలో ఏదో ఒక వినూత్న ఐడియాగా ప్లాన్ చేసి వైరల్ అయిన వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం. పెళ్లి భరాత్ లో డ్యాన్స్ లు చేస్తూ కూడా ఫేమస్ అయిన దాఖలాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ పెళ్లి జంట వినూత్న రీతిలో ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల పెళ్లి పత్రికల్లో తమకు నచ్చిన రాజకీయ నాయకులు లేదా హీరోల ఫోటోలు వేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐపీఎల్ క్రేజ్ నడుస్తోంది. క్రికెట్ అంటే ఆడ, మగ అనే తేడా లేకుండా యువత ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట మాత్రం తమ పెళ్లి ఆహ్వాన పత్రికలో తమకు నచ్చిన ఐపీఎల్ టీం ఫోటోను వేయించింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తమ పెళ్లి పత్రికలో సీఎస్కే టీం ఫోటోను పెట్టి పంపిణీ చేసింది.

Advertisement

పెళ్లి పత్రికలో ఓ వైపు పెళ్లి వివరాలు మరోవైపు సీఎస్కే ఫోటోతో పాటు ట్రోఫీని కూడా పెట్టించింది. సీఎస్కే టీం ట్రోఫీని పట్టుకుని దిగినట్లు పెట్టించింది. దీంతో ఈ పత్రిక నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన సీఎస్కే అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×