BigTV English

Vikramarkudu 2: స్క్రిప్ట్ ఓకే కానీ.. అదే డౌట్.. ?

Vikramarkudu 2: స్క్రిప్ట్ ఓకే కానీ.. అదే డౌట్.. ?

Vikramarkudu 2: ప్రస్తుతం టాలీవుడ్ లో అంతా సీక్వెల్స్ హంగామా నడుస్తున్న విషయం తెలిసింది చిన్న సినిమా పెద్ద సినిమా హిట్ సినిమా ప్లాప్ సినిమా అని తేడా లేకుండా సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఎన్నో సినిమాలు అధికారికంగా కూడా ప్రకటించారు కూడా. ఇక తాజాగా మరో హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. మాస్ మహారాజా రవితేజ- రాజమౌళి కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


రవితేజ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల లిస్టులో విక్రమార్కుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎప్పటినుంచో ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా నిర్మాత రాధామోహన్ ఈ సీక్వెల్ ను కన్ఫర్మ్ చేయడం మరింత హీట్ పెంచేసింది. రైటర్ విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 స్క్రిప్ట్ రెడీ చేశారు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా రానుంది” అంటూ చెప్పకు వచ్చాడు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే.. విక్రమార్కుడు 2 ఎప్పుడు మొదలవుతుంది. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి.. మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. విక్రమార్కుడు గా రవితేజను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం. అదే విధంగా రాజమౌళి తప్ప ఈ సీక్వెల్ కు ఎవరు న్యాయం చేయలేరు. ఇలా చూసుకుంటూ పోతే స్క్రిప్ట్ ఓకే అయినా కూడా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి అంటే ఎన్నో అడ్డంకులను దాటుకొని వెళ్ళాలి. మరి ఈ కాంబో.. అనుకున్న టీమ్ తోనే వస్తుందో.. లేక వేరే టీమ్ హ్యాండిల్ చేస్తారో చూడాలి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×