E-Paper
Advertisement

Italy Robbery: హాలీవుడ్ సిన్మా మాదిరిగా ఇటలీ హైవేపై భారీ దోపిడీ..నగదు వ్యాన్ పేల్చివేత, వీడియో వైరల్

Italy Robbery: హాలీవుడ్ సిన్మా మాదిరిగా ఇటలీ హైవేపై భారీ దోపిడీ..నగదు వ్యాన్ పేల్చివేత, వీడియో వైరల్
Advertisement

Italy Robbery: ఇటలీలో భారీ దోపిడీకి స్కెచ్ వేసింది ఓ గ్యాంగ్. భారీగా నగదు తీసుకెళ్తున్న వాహనాన్ని నడిరోడ్డుపై ఆపి దోచుకునే ప్రయత్నం చేశారు. ఈలోగా పోలీసులు అలర్ట్ కావడంతో నగదు వ్యాన్‌ని పేల్చేశారు. దీనికి సంబందించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది?

ఇటలీ హైవేపై భారీ దోపిడీ ప్రయత్నం

Advertisement

విదేశాల్లో దోపిడీలు దారుణంగా జరుగుతుంటాయి. ఒక్కవిధంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి. ఎందుకంటే భారీ ఎత్తున నగదు కొల్లగొట్టేందుకు పక్కాగా ప్లాన్ చేస్తారు. ఇటలీలో కూడా ఆ విధంగా వేశారు. కాకపోతే పోలీసులు రౌండప్ చేయడంతో అడ్డంగా ఇద్దరు చిక్కారు. మరికొందరు కోసం గాలింపు మొదలుపెట్టారు అసలేం జరిగింది.

సౌత్ ఇటలీలో హాలీవుడ్ సినిమా రేంజ్ దొంగతనానికి ప్లాన్ చేశారు దోపిడీ దొంగలు. భారీగా నగదు తీసుకెళ్తున్న వాహనాన్ని నడిరోడ్డుపై ఆపి దోచుకునేందుకు ప్లాన్ చేశారు. అయితే వ్యాన్ వెనుక భాగంలో సెక్యూరిటీ అలర్ట్ కావడంతో ఏం చెయ్యాలో తెలియక తీసుకొచ్చిన పేలుడు పదార్థాలను వ్యాన్‌ని పేల్చుతూ అక్కడి పరారయ్యే ప్రయత్నం చేశారు.

Advertisement

సెక్యూరిటీ అధికారులు రియాక్ట్ కావడంతో వాహనం పేల్చివేత

ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. పగటి వేళ జరిగిన ఈ ఘటనకు సంబంధించి దూరంలో ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని మొబైల్ ఫోన్‌లో బంధించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సోమవారం ఉదయం 8 గంటల సమయంలో దక్షిణ ఇటలీలోని ఓ హైవేపై ఈ ఘటన జరిగింది. నగదు వ్యాన్‌ని దోపిడీకి ప్రయత్నం చేయడం భయాందోళనలకు దారితీసింది. ఓ వైపు కాల్పులు, మరోవైపు పేలుడు, ఇంకోవైపు పొగ బాంబులు పేల్చడంతో దట్టమైన పొగ అలముకుంది.  అక్కడి వాతావరణం చూసి వాహనాదారులు హడలిపోయారు.

ALSO READ: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి బాడీబిల్డర్ ఆత్మహత్య

బాటిస్టోల్లి-BTV అనే ప్రైవేట్ భద్రతా సంస్థ నడుపుతున్న ఆ నగదు వాహనాన్ని దోచుకునేందుకు అడ్డగించారు దోపిడీ గ్యాంగ్. సెక్యూరిటీ అధికారులు రౌండప్ చేయడంతో దొంగలు ఆ వ్యాన్‌ని పేల్చివేశారు. పరిస్థితి జఠిలం కావడంతో ఇటాలియన్ మిలిటరీ పోలీసులు కాల్పులకు దిగారు. పొగ ముసుగులో దొంగలు పరారీ అయ్యారు. కాకపోతే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్‌లో కనీసం ఆరుగురు దొంగలు ముసుగు ధరించినట్టు తెలుస్తోంది. కొందరు తెల్లటి దుస్తులు ధరించి ఆయుధాలు పట్టుకుని దాడిని సమన్వయం చేసినట్టు కనిపిస్తోంది. ఈ బృందం ట్రాఫిక్‌ను అడ్డుకోవడానికి వాహనాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోందని తెలిపారు. నగదు అంతా సేఫ్‌‌గా ఉందని అధికారులు చెబుతున్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×