BigTV English

Viral News: రెండేళ్ల చిన్నారి లింక్డిన్ మెయింటెన్ చేస్తున్నాడు.. పోస్ట్ చూస్తే షాక్ అవుతారు

Viral News: రెండేళ్ల చిన్నారి లింక్డిన్ మెయింటెన్ చేస్తున్నాడు.. పోస్ట్ చూస్తే షాక్ అవుతారు

Viral News: సోషల్ మీడియా యుగం వేగంగా వ్యాప్తి చెందుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అయితే టెక్నాలజీ వేగం పెరుగుతున్న ఈ తరుణంలో ఉద్యోగాల కోసం కూడా ఏ మాత్రం కష్టపడకుండా కేవలం ఫోన్లలోనే వెతుక్కునే సులభతరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అందులో భాగంగా ఉద్యోగం వెతుక్కోవడానికి లింక్డిన్ ఓ వేదికగా మారింది. లింక్డిన్ లో ఉద్యోగం కోసం ప్రొఫైల్ అప్లోడ్ చేస్తే చాలు ఎన్నో ఉద్యోగావకాశాలు వెంటనే వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే తాజాగా లింక్డిన్ లో ఓ రెండేళ్ల చిన్నారి ప్రొఫైల్ దర్శనమిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.


రెండేళ్ల బాలుడికి లింక్డిన్ లో ప్రొఫైల్ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాఫీ ఇండియా వైస్ చైర్మన్ అయిన శివేష్ కుమార్ కొడుకు అతడు. తన రెండేళ్ల కుమారుడి కోసం శివేష్ కుమార్ లింక్డిన్ లో ఏకంగా ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. టైగర్ చౌహాన్ అనే పేరుతో క్రియేట్ చేసిన ఈ అకౌంట్ నుంచి ఓ మెసేజ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘నేను పిల్లాడిని. వరల్డ్ లో నా పొజిషన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నా. మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటారు. నెట్ వర్క్ ఈజ్ వెల్త్ అని. అందుకే నా కెరీర్ కు సహాయపడే నెట్ వర్క్ కోసం ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను’ అని రాసుకొచ్చాడు.

అంతేకాదు టైగర్ చౌహాన్ ఇంట్లో చాలా ఒత్తిడి అనుభవిస్తున్నానని, తనను స్కూళ్లో చేర్చేందుకు ఇంట్లో పెద్ద చర్చలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రీస్కూల్ లో జాయిన్ అవ్వడానికి తనకు ఈ నెట్ వర్క్ సహాయపడుతుందని తెలిపాడు. అందుకే లింక్డిన్ లో పోస్ట్ పెట్టినట్లు రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఈ కాలంలో వీడియోలు చూసే వయసులో లింక్డిన్ లో తన కెరీర్ కోసం వెతుకులాట ప్రారంభించడం నిజంగా ఓ అద్భుతం అని అంటున్నారు.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×