BigTV English

Rajasekhar: మళ్లీ మగాడుగా వస్తున్న రాజశేఖర్.. ?

Rajasekhar: మళ్లీ మగాడుగా వస్తున్న రాజశేఖర్.. ?

Rajasekhar: సీనియర్ హీరో రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం  చేయాల్సిన  అవసరం లేదు. యాంగ్రీ మ్యాన్ గా  తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్న రాజశేఖర్..   మొన్నటివరకు హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  శేఖర్ అనే  సినిమా తరువాత ఆరోగ్యం బాగోక కొంత గ్యాప్ తీసుకున్న  ఆయన..  నితిన్ నటించిన  ఎక్స్టా ఆర్డినరీ మ్యాన్  సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు.


ఇక ఈ మధ్యనే రాజశేఖర్.. ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కుర్ర డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ ఒక  సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం రాజశేఖర్ బాగానే కష్టపడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కోసం పవన్.. ఒక అద్భుతమైన టైటిల్ ను అనుకున్నట్లు టాక్ నడుస్తోంది. రాజశేఖర్ కటౌట్ కు తగ్గట్లు మగాడు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.

35 ఏళ్ళ క్రితం రాజశేఖర్  ఇదే టైటిల్ తో ఒక సినిమా చేశాడు. కె మధు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆ టైటిల్ నే తీసుకొందామనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్. దానికి రాజశేఖర్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో కూడా  యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయని, టైటిల్ కు తగ్గట్టుగానే కథ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇందులో నిజమెంత  అనేది తెలియాల్సి ఉంది.


ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. రాజశేఖర్  కు యాప్ట్ టైటిల్ మగాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివాళ్లు తప్ప.. మిగిలిన హీరోలు.. ఇప్పుడు కీలక పాత్రల్లోనో, విలన్స్ గానో సెటిల్ అయ్యారు.

కానీ, రాజశేఖర్ మాత్రం ఇంకా హీరోగా  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అది కాక.. ఇప్పుడిప్పుడే  అనారోగ్యం నుంచి కోలుకుంటున్న రాజశేఖర్ .. ఇలాంటి యాక్షన్ సినిమాలు చేయడం రిస్క్ అని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. మరి.. మళ్లీ మగాడు తెరమీద ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×