BigTV English

Viral Video: క్లీన్ షేవ్ చేసుకున్న యువకుడిని చితకబాదిన తండ్రి..

Viral Video: క్లీన్ షేవ్ చేసుకున్న యువకుడిని చితకబాదిన తండ్రి..

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని పూర్తిగా నవ్వించేలా ఉంటే మరికొన్ని మాత్రం షాక్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు తరచూ శరవేగంగా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో తండ్రీ కొడుకులకు సంబంధించింది. ఇందులో కొడుకు క్లీన్ షేవ్ చేసుకుని తండ్రిని, కుటుంబాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ అతని తండ్రి అతనిని చూడగానే కంగారుపడ్డాడు. తలుపు వద్దే కొడుకును కొట్టడం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే ఓ యువకుడు తొలి సారిగా క్లీన్ షేవ్ చేసుకున్నాడు. క్లీన్ షేవ్ చేసుకోవడం ద్వారా తన కుటుంబాన్ని ఆశ్చర్యపర్చాలని ప్లాన్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతింటారని అనుకున్నాడు. కానీ అసలు ఏం జరిగుతుందో ముందే ఊహించలేకపోయాడు. ఆ అబ్బాయి నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు. నెమ్మదిగా తన ముఖాన్ని తన తండ్రికి చూపించాలని, చూసి ఏలా రియాక్ట్ అవుతాడో దానిని వీడియో చేయాలని అనుకున్నాడు.

ఈ తరుణంలో తండ్రిని పిలిచి తులపు వద్ద ముఖం చాటుకుని ఉన్నాడు. తండ్రి తన వద్దకు వచ్చి పిలవగానే ఒక్కసారిగా నవ్వుతూ తండ్రి వైపు తిరిగాడు. దీంతో తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో అని చూడగా.. తనను కొట్టడం ప్రారంభించాడు. మొదట ఒక చెంపపై దెబ్బ వేయడంతో షాక్ అయ్యాడు. అనంతరం చితకబాదాడు. దీంతో ఎంతో సంతోషంగా సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తే చివరకు తండ్రి తనకు షాక్ ఇచ్చాడు. అయితే ఇలా జరిగినా కూడా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వీడియోను చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

×