E-Paper
Advertisement

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Viral Video:  రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!
Advertisement

కొంత మంది బైకర్లు రోడ్ల మీద చేసి పిచ్చి పనులు ఇతరుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. విపరీతమైన వేగంతో ప్రయాణించడం, స్టంట్లు చేయడం, ఎదుటి వాహనాలకు ఇబ్బంది కలిగించడం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తూ నడి రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ గాజు పెంకులు గుచ్చుకుని కార్లు, బైకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చెత్త పని చేసిన బైకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాటిల్ రోడ్డు మీద విసిరినట్టుగా అతడిని పట్టుకుని తల మీద విసరాలంటున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా ఓ యువకుడు జాతీయ రహదారి మీద బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. చేతిలో ఓ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ పట్టుకున్నాడు. దానిని బాగా షేక్ చేసి ఒక్కసారిగా రోడ్డు మీద విసిరేశాడు.  బాటిల్ ప్రెషర్ తో రోడ్డు మీద పడగానే ముక్కలు ముక్కలై రోడ్డంతా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ గాజు ముక్కల కారణంగా రోడ్డు మీద వెళ్లే ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వేగంగా ఉన్నప్పుడు టైర్లకు ఈ గాజు ముక్కలు గుచ్చుకుంటే ఒక్కసారిగా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బైకర్ పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బైకర్ పై మండిపడుతున్నారు. అతడిని అరెస్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అతడిని పట్టుకున్న తర్వాత ఓ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ను అతడి తల మీద కొట్టాలంటున్నారు. “ఒక రీల్‌ కోసం, సోషల్ మీడియాలో వచ్చే లైక్‌ ల కోసం బైకర్ ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇలాంటి వాడిని అస్సలు వదలకూడదు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఇలాంటి వాడికి రోడ్డు మీద తిరిగే అర్హత లేదు. వెంటనే జైల్లో వేయాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. చెత్త పనులు చేసే మరికొంత మందికి భయం కలుగుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.

Advertisement

Read Also: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఇక ఈ ఘటన ఎక్కడ జరిగింది అనది కరెక్ట్ గా తెలియదు. కొంతమంది నెటిజన్లు ఈ ఘటన రాజస్థాన్ లో జరిగిందని చెప్తుండగా, మరికొంత గుజరాత్ లోని సౌరాష్ట్రలో జరిగినట్లు చెప్తున్నారు. కచ్చితమైన సమాచారం లేకపోయినా, అతడు చేసిన పని మాత్రం క్షమించరానిదంటున్నారు. రీల్స్ కోసం ప్రాణాలను తీసే ప్రయత్నం చేయనున్నారు.

Read Also: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×