E-Paper
Advertisement

Viral: మెట్రోలోనే గంజాయి కొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్.. చివరికీ ఏం జరిగిందంటే..

Viral: మెట్రోలోనే గంజాయి కొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్.. చివరికీ ఏం జరిగిందంటే..
Advertisement

Viral: ప్రస్తుతం ఉన్న యువత విపరీతమైన చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మద్యపానం, ధూమపానం, గంజాయి అంటూ అలవాటు పడిపోతున్నారు. దీనికి వయసు ఎంత అని కూడా ఆలోచించకుండా పదవ తరగతి యువకుడి నుంచి పాతికేళ్ల యువకుల వరకు ఇలాంటి చెడు అలవాట్లను అలవరుచుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ విషయాలు ఇంట్లో తెలిసినా కూడా కొంత మంది తల్లిదండ్రులు కూడా వారిని పట్టించుకోకుండా పరోక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటివి జరిగినా కూడా చాటుగా ఎక్కడో చేస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం మద్యం, సిగరెట్ కాదు ఏకంగా గంజాయిని అది కూడా పబ్లిక్‌లో తీసుకున్నాడు.

లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే ఓ కాన్సెప్ట్ తో యువత ఏది పడిదే అది చేస్తున్నారు. ఇలా చేసేముందు కనీసం ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని కూడా ఆలోచించడం లేదు. గంజాయి అంటేనే పోలీసుల దగ్గరనుంచి తల్లిదండ్రుల వరకు వణికిపోతారు. ముఖ్యంగా కాలేజీ యువతలు ఇలాంటి వాటికి బానిసలు అవుతున్నారని కూడా వారు తరచూ బాధపడుతుంటారు. అయితే తాజాగా ఓ యువకుడు ఏకంగా పబ్లిక్ ప్లేస్‌లోనే గంజాయి తీసుకున్నాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని కూడా ఆలోచించకుండా పబ్లిక్‌లోనే గంజాయిని తీసుకున్నాడు.

Advertisement

పబ్లిక్‌లోనే ఓ యువకుడు గంజాయి తాగుతూ దర్శనమిచ్చాడు. ఈ ఘటన చెన్నై మెట్రోలో వెలుగుచూసింది. విమ్కోనగర్‌ నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే మెట్రోలో ఓ యువకుడు గంజాయి తాగాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని భువనేష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×