Music Shop Murthy: అజయ్ ఘోష్ – చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిక్ షాప్ మూర్తి’ చిత్రం సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో సినిమాను చూసిన తరువాత ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ను సినిమా కట్టి పడేసింది. ఈ చిత్రం ఓటీటీలోకి కూడా వచ్చింది. ఆమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ క్రమంలో చిత్ర బృందం మీడియా ప్రతినిధులతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోపాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నది.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమాలో మీకు కనిపించిన చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగాయి. ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఈ సినిమా. విజయం సాధించిన ప్రతి పర్సన్ ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చి ఉంటారు. వాటి ఆధారంగా ఈ సినిమాను తీశాం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సినిమా చూసి మేం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటున్నారు. అంతేకాదు.. నన్ను తెలుగు తెరపై మొదటిసారిగా చూపించిన ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ సినిమాను చూసి.. నాకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. ప్రతి సీన్ ను కూడా ఎంతో అద్భుతంగా తీశారంటూ అభినందించారు’ అంటూ అజయ్ ఘోష్ అన్నారు. అదేవిధంగా మరో నటుడు నాని మాట్లాడుతూ.. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పారు.
Also Read: ఏది.. ప్రభాస్ లుక్ గురించి ఇప్పుడు మాట్లాడండిరా చూద్దాం..
ఆ తరువాత హీరోయిన్ చాందినీ చౌదరీ మాట్లాడారు. ‘నేను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నిటి కంటే కూడా ఈ సినిమాలోనే చాలా బాగున్నానని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమాకు థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తున్నది. విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. కథ విన్నప్పుడే నేను అనుకున్నాను.. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని.. అలాగే హిట్ అయ్యింది. త్వరలోనే మిగతా బాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతున్నది’ అంటూ చాందినీ పేర్కొన్నది.
అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడాతూ..’మొన్న మిడ్ నైట్ సమయంలో ఈ సినిమాను చూశాను. 40 నిమిషాల పాటు సినిమా చూశాక నా మతి పోయింది. అంతేకాదు.. ఎండింగ్ లో ఈ సినిమాలోని సీన్స్ చూసి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అంత బాగుంది ఈ సినిమా. కష్టాలు, కన్నీళ్లే కాదు.. మంచితనంతోనూ ప్రేక్షకుల హృదయాలను దోచేశారు’అని అన్నారు.
డైరెక్టర్ శివ మాట్లాడుతూ..’ఇది నా ఫస్ట్ మూవీ. ఈ సినిమా తీసిన తరువాత ఒక మంచి చిత్రాన్ని ఎలా తీయాలి..? కష్టనష్టాలు ఏంటి అనేది నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ముందుముందు ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తాను’ అంటూ శివ చెప్పారు.