Big Stories

Aamir Khan: కాంగ్రెస్ పార్టీని గెలిపించండని నేనెప్పుడూ చెప్పలేదు

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువారికి కూడా అమీర్ సుపరిచితుడే. ఆయన సెలెక్ట్ చేసుకొనే కథలు ఎంతో యూనిక్ గా ఉంటాయి. ఇక ఈ ఆద్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అమీర్ కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ కొత్త కాదు. తన 35 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో చూసిన ఈ మిస్టర్ పర్ఫెక్ట్ రాజకీయాల జోలికి మాత్రం పోలేదు.

- Advertisement -

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ కాంగ్రెస్ ను గెలిపించమని అమీర్ అడుగుతూ ఒక వీడియో పోస్ట్ అయ్యింది. దీంతో ఎన్నడూ లేనిది అమీర్ రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి.. ? కాంగ్రెస్ ను గెలిపించమనడం ఏంటి.. ? అని అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై అమీర్ ఖాన్ స్పందించాడు. ఆ వీడియో ఫేక్ అని స్పష్టం చేశాడు. తానెప్పుడూ ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయలేదని తేల్చి చెప్పాడు.

- Advertisement -

” నా 35 ఏళ్ళ కెరీర్ లో నేనెప్పుడూ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసింది లేదు. ఏ పార్టీని గెలిపించమని నేను చెప్పలేదు. ఆ వీడియో ఫేక్. ఆ వీడియో క్రియేట్ చేసినవారిపై తగిన చర్యలు తీసుకుంటాను. వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మకండి. కేవలం నేను ఎన్నికల సంఘం కోసం ప్రచారం చేశాను. ఓటు.. మన హక్కు.. దాన్ని వినియోగించుకోవాలని మాత్రమే చెప్పాను. అది కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News