E-Paper
Advertisement

Viral Video: వీడెవడండి బాబూ.. రోడ్డుపై నిలిచిన నీటిలో ఈతకొడుతున్నాడు..

Viral Video: వీడెవడండి బాబూ.. రోడ్డుపై నిలిచిన నీటిలో ఈతకొడుతున్నాడు..
Advertisement

Viral Video: వర్షాకాలం మొదలైందో లేదో.. దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. తాజాగా పూణెలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ కురుస్తున్న వానల కారణంగా రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే ఓవైపు వాహనాలు వెళ్లడానికే ఇబ్బందిగా ఉందిరా బాబూ అని నానాతంటాలు పడుతుంటే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రోడ్డుపై స్విమ్మింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డుపై నిలిచిన వరద నీటిలో ఓ వ్యక్తి ఈత కొట్డడం చూసిన స్థానికులు, వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా కూడా లెక్కచేయకుండా రోడ్డుపై ఇలా చేయడం చూసి అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అయితే నీటిలో ఓవైపు ఈత కొడుతూ కూడా తలపై ఓ కవర్‌ను పెట్టుకుని మరి ఈత కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

కాగా, ఇటీవల ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫేమస్ అవ్వాలని, లేదా వైరల్ అవ్వాలనే ఆలోచనతో యువకులు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. వరద నీటిలో డ్యాన్సులు చేయడం, స్విమ్మింగ్ చేయడం, లేదా ఆటలు ఆడడం వంటివి చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.

 

Advertisement

https://Twitter.com/purankumawat76/status/1799437503688282559?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×