BigTV English

Rahu Dosh: రాహు దోషంతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి

Rahu Dosh: రాహు దోషంతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి

Rahu Dosh: చాలా మంది జాతకాల్లో ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది అని భయపడుతుంటారు. వారి జీవితాల్లో ఉండే కష్టాలు, జరిగే ప్రమాదాలను బట్టి ఏదో దోషం తమను వెంటాడుతుందని భావిస్తుంటారు. అయితే ముఖ్యంగా దోషాల్లో శని దోషం, రాహు దోషం, కుజ దోషం, పితృ దోషం వంటివి ఎక్కువగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి పూజలు, వ్రతాలు, ఉపవాసాలు వంటివి చేస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుదోషం ఉన్న వారు దాన ధర్మాలు చేయడం వల్ల పెద్ద పెద్ద కష్టాల నుంచి విముక్తి పొందుతారని చెబుతుంది. అంటే నిరుపేదలకు దానం చేయడం, జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం వంటి వాటి ద్వారా చాలా మేరకు దోష నివారణ కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఇది పుణ్యకార్యంగాను పరిగణిస్తారు.


పుణ్య ప్రతాపాన్ని పెంచుతుంది

తరచూ దాన ధర్మాలు చేయడం ఆత్మ సంతృప్తిని పొందడమే కాకుండా, రాహువు , శని వలన కలిగే దోషాలు కూడా తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మూగ జీవాలైన పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం వల్ల కష్టాలు కూడా తగ్గుతాయి. ఒకవైపు దుర్గుణాలు తగ్గుతూనే మరోవైపు క్రమంగా పుణ్యాలు పెరుగుతాయి.


పిత్ర దోషం తగ్గుతుంది

పితృ పక్షం సమయంలో పక్షులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు కూడా సంతోషిస్తారు. జాతకంలో రాహువు ప్రభావం కూడా తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. జీవితంలో పురోగతి సాధించే విషయంలో వచ్చే ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. సంపద పెరుగుతుంది. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది.

కోరికలు నెరవేరుతాయి

పక్షులకు గింజలు వేయడం వల్ల వాటి కడుపు నిండుతుంది. ఓవైపు పక్షలుకు నీరును కూడా అందించడం వల్ల వాటి దాహం తీరి పుణ్యం లభిస్తుంది. ఇవే కాకుండా ఇంట్లో వండిన బియ్యం, కొన్ని ముడి గింజలను కూడా పక్షులకు పెట్టవచ్చు. ఇలా పక్షులకు తరచూ ఆహారం పెట్టడం వల్ల మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కోర్టు కేసుల నుండి విముక్తి పొందడంతో పాటు పిల్లలు విదేశాల్లో చదువుకోడానికి వెళితే వారి జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×